Vishal : ”సామాన్యుడు” వచ్చేస్తున్నాడు

ఆగస్టు 29న హీరో విశాల్ తన 44 జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది

Vishal : ”సామాన్యుడు” వచ్చేస్తున్నాడు

Vishal

తెలుగు తమిళ భాషల్లో భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్.. తెలుగు వాడైనప్పట్టికి కొలీవూడ్ లో తిరుగులేని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ రోజు విశాల్ జన్మదినం సందర్బంగా ఆయన హీరోగా నటిస్తున్న సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న 31వ సినిమా అప్డేట్ ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. ఈ చిత్రానికి సామాన్యుడు అనే టైటిల్ ఫిక్స్ చేసింది.

ఇక ఈ సినిమాకు నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ టైటిల్‌ కు సంబంధించిన పోస్టర్‌ చిత్ర బృందం విడుదల చేసింది. ఈదు థెవైయో అధువే ధర్మం అనే షార్ట్‌ ఫిల్మ్‌ తో మంచి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న శరవణన్‌ విశాల్‌ 31 వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీని విశాల్‌ ఫిలిం ప్యాకట్‌ రి బేనర్‌ పై నిర్మిస్తున్నారు.