RRR UK Schedule : ఎండ్ కొచ్చేసరికి ఎనర్జీ ట్రిపుల్ అయ్యిందిగా..

తారక్, చరణ్, అలియా భట్‌ల మీద ఓ బ్యూటిఫుల్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ పిక్చరైజ్ చెయ్యబోతున్నారు..

10TV Telugu News

RRR UK Schedule: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లను కొమరం భీం, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో చూపిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’..

RRR Poster : ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై పోలీస్ పంచ్.. పోలీసుల పంచ్‌పై రివర్స్ పంచ్!

డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. దీంతో ప్రమోషన్స్ మీద ఫోకస్ చేసింది టీం. ఆగస్టు 1వ తేది ఉదయం 11 గంటలకు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ రైట్స్ టి-సిరీస్, లహరి మ్యూజిక్ సంస్థలు హయ్యెస్ట్ ప్రైజ్‌కి సొంతం చేసుకున్నాయి.

RRR Movie : మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్.. ఫస్ట్ సాంగ్ ‘దోస్తీ’ వచ్చేస్తోంది..

ఫైనల్ షెడ్యూల్ యూకేలో ప్లాన్ చేశారు. తారక్, చరణ్, అలియా భట్‌ల మీద ఓ బ్యూటిఫుల్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ పిక్చరైజ్ చెయ్యబోతున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఆగస్టు 1వ తేది హైదరాబాద్ నుండి ఎన్టీఆర్, చరణ్, బాంబే నుండి అలియా అబ్రోడ్ చేరుకుంటారు. ఆగస్టు 2 నుండి షూట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Jr NTR – Rajamouli : ఎన్టీఆర్ – రాజమౌళి వాలీబాల్ భలే ఆడుతున్నారుగా..!

10TV Telugu News