Latha Bhagawan Khare : 65 ఏళ్ళ మహిళ జీవితంపై మరాఠీలో బయోపిక్.. త్వరలో పాన్ ఇండియా సినిమాగా రీమేక్..

రెండేళ్ల క్రితం మరాఠీలో ఓ బయోపిక్ వచ్చింది. అయితే ఇది ఏ పెద్ద స్టార్ హీరోదో, సెలబ్రిటిదో, ఆటగాడిదో కాదు కేవలం ఒక 65 ఏళ్ళ సాధారణ మహిళది. మహారాష్ట్రకు సంబంధించిన.....................

Latha Bhagawan Khare : 65 ఏళ్ళ మహిళ జీవితంపై మరాఠీలో బయోపిక్.. త్వరలో పాన్ ఇండియా సినిమాగా రీమేక్..

Latha Kare

Latha Bhagawan Khare :  ఇటీవల కాలంలో బయోపిక్ లు చాలానే వచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం మరాఠీలో ఓ బయోపిక్ వచ్చింది. అయితే ఇది ఏ పెద్ద స్టార్ హీరోదో, సెలబ్రిటిదో, ఆటగాడిదో కాదు కేవలం ఒక 65 ఏళ్ళ సాధారణ మహిళది. మహారాష్ట్రకు సంబంధించిన ఓ గ్రామీణ మహిళా ఆధారంగా తెరకెక్కిన ‘లతా భగవాన్‌ కారే’ అనే బయోపిక్ 67వ జాతీయ ఉత్తమ చిత్రం జ్యూరీ అవార్డు కూడా దక్కించుకుంది.

మహారాష్ట్రలో ఓ గ్రామానికి సంబంధించిన సాధారణ మహిళ లతా భర్త భగవాన్‌ ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం అందించడానికి డబ్బుల కోసం ఎస్‌కె మారథాన్‌ రేస్‌లో పాల్గొని గెలిచింది. ఈ 65ఏళ్ల లతా కారే జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘లతా భగవాన్‌ కారే’ 2020లో మరాఠిలో రిలీజ్ అయి జాతీయ అవార్డుని దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రీమేక్ చేయబోతున్నారు.

Nivetha Pethuraj : సినిమా ఆఫర్లు లేకపోతే ఉద్యోగం చేసుకుంటాను.. భయపడాల్సిన అవసరం లేదు..

తెలుగు వ్యక్తులు అయిన నవీన్‌ దేశబోయిన దర్శకత్వంలో ఎర్రబోతు కృష్ణ మరాఠీలో ఈ చిత్రం నిర్మించారు. ఇప్పుడు వారే ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా నిర్మించనున్నారు. ఈ సినిమా కథని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని మరాఠీ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిందని దర్శకుడు తెలిపాడు. ఇందులోని మెయిన్ క్యారెక్టర్ ని లతా కారేనే పోషించడం విశేషం.