Latha Mangeshkar : మోదీకి తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

ఆమె మరణాంతరం ప్రారంభించి తొలిసారి ఈ అవార్డుల్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ముంబైలో ఆదివారం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీకి ఈ లతా దీనానాథ్ మంగేష్కర్.......

Latha Mangeshkar : మోదీకి తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

Modi

 

Latha Mangeshkar :  తన పాటలతో దేశం మొత్తాన్ని మైమరిపించిన గ్రేట్ సింగర్ లతా మంగేష్కర్. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఆమె దహన కార్యక్రమాలని కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆమె దహన కార్యక్రమాలకి విచ్చేసారు. భారతరత్నతో సహా మరెన్నో అవార్డుల్ని అందుకున్నారు లతా మంగేష్కర్. ఇప్పుడు ఆవిడ మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆమె పేరు మీద లతా మంగేష్కర్ స్మారకార్థం అవార్డుల్ని నెలకొల్పి పలు రంగాలలో ఎనలేని సేవ చేసిన వారికి ఆ అవార్డులని అందిస్తున్నారు.

లతామంగేష్కర్ తండ్రి పేరు కూడా కలిసి వచ్చేలా ఈ అవార్డుకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అని పేరు పెట్టారు. ఆమె మరణాంతరం ప్రారంభించి తొలిసారి ఈ అవార్డుల్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ముంబైలో ఆదివారం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీకి ఈ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుని అందించారు. ఈ అవార్డుని ప్రధాని మోదీ ఆమె కుటుంబ సభ్యుల నుంచి అందుకున్నారు. మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఇవ్వనున్నారు.

Ram Charan : ‘ఆచార్య’లో నేను ఉన్నానని నాకే తెలీదు..

అవార్డు తీసుకున్న తర్వాత మోదీ మాట్లాడుతూ.. ”లతా దీదీ నాకు అక్కలాంటిది. ఆమె నాకు ఎంతో ప్రేమని పంచింది. లతా దీదీ అక్క పేరు మీద అవార్డు వచ్చినప్పుడు అది ఆమెలోని ఏకత్వానికి, నాపై ఉన్న ప్రేమకు ప్రతీక. అందుకే అంగీకరించకపోవడం నాకు సాధ్యం కాదు. ఈ అవార్డుని దేశ ప్రజలందరికీ అంకితం చేస్తున్నాను” అని తెలిపారు. ఆ తర్వాత మరి కొన్ని రంగాల్లో ప్రతిభావంతులకు ఈ అవార్డుని అందించారు. ఆమె కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ఆమెకు నివాళులు అర్పించారు.

 

Latha Mangeshkar