Lavanya Tripathi : నా కోసం కథ రాసుకున్నారు.. 9 కిలోల బరువు ఉన్న గన్స్‌ పట్టుకుని షూట్ చేయడం చాలా కష్టం..

తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది. లావణ్య త్రిపాఠి సినిమా గురించి మాట్లాడుతూ.........

Lavanya Tripathi : నా కోసం కథ రాసుకున్నారు.. 9 కిలోల బరువు ఉన్న గన్స్‌ పట్టుకుని షూట్ చేయడం చాలా కష్టం..

Happy Birthday

Happy Birthday :  మత్తు వదలరా సినిమాతో మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు రితేష్ రానా. ప్రస్తుతం ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ గా, వెన్నెల కిషోర్, సత్య ముఖ్యపాత్రలుగా యాక్షన్ కామెడీ నేపథ్యంలో గన్ కల్చర్ తో సరి కొత్తగా ఈ సినిమాని తెరకెక్కించాడు రితేష్. జులై 8న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది. లావణ్య త్రిపాఠి సినిమా గురించి మాట్లాడుతూ.. ”ఓ ఇంటర్వ్యూలో నన్ను చూసి రితేష్‌ రానా హ్యాపీ పాత్రని నా కోసం రాశారు. నా కోసం ఒక పాత్రని రాయడం నా అదృష్టం. ‘హ్యాపీ బర్త్‌డే’ జోనర్, కథ, కథనం అన్నీ కొత్తగా ఉంటాయి. మొదటిసారి నేను స్క్రీన్‌పై యాక్షన్‌ చేశాను. నిజజీవితంలో నేను చాలా సరదాగా ఉంటాను కాబట్టి ఈ మూవీలో కామెడీ చేయడం ఈజీగానే అనిపించింది. కాకపోతే 9 కిలోల బరువు ఉండే గన్స్‌ పట్టుకుని షూటింగ్‌ చేయడం కొంచెం కష్టం అనిపించింది. కానీ పాత్ర కోసం తప్పదు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదు. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది” అని తెలిపింది.

NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!

తన సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ..”నేను చాలా కథలు వింటాను కానీ చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ వస్తుండటంతో వెంటవెంటనే సినిమాలు చెయ్యట్లేదు. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, ఇన్ని రోజులు కెరీర్ ఉందంటే అది గొప్పే. అందరూ నంబర్‌ వన్‌కి వెళ్లాలని ఉండదు. నా వర్క్‌ని నేను ఎంజాయ్‌ చేస్తాను. మనసుకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ నా ప్రయాణం సంతృప్తిగా కొనసాగిస్తున్నాను. నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. ఫుల్ యాక్షన్ సినిమాలు వస్తే కచ్చితంగా చేస్తాను. ప్రస్తుతం తమిళ్‌లో అథర్వతో ఓ సినిమా, తెలుగులో ఆది సాయికుమార్‌తో ‘పులి–మేక’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను” అని తెలిపింది లావణ్య త్రిపాఠి.