Varun Tej : లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..

తాజాగా లావణ్య - వరుణ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. జూన్ మొదటి వారలో వీరి నిశ్చితార్థం ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది.

Varun Tej : లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..

Lavanya Tripathi and Varun Tej pair going viral again

Lavanya Tripathi :  హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. అవి వైరల్ అయినా కూడా ఇద్దరూ స్పందించలేదు. ఇప్పుడు మరోసారి ఈ జంట వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కలిసి గతంలో మిస్టర్(Mister), అంతరిక్షం అనే రెండు సినిమాలు చేశారు.

అంతరిక్షం సినిమా సమయం నుంచే వీరిద్దరూ క్లోజ్ అయ్యారని, ఆ తర్వాత లవ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వరుణ్ చెల్లి నిహారిక పెళ్ళికి ఏ హీరోయిన్ రాకపోయినా లావణ్య వచ్చింది. దీంతో ఈ న్యూస్ మరింత బలపడింది. నిహారికతో కూడా లావణ్య చాలా క్లోజ్ గా ఉంటుంది. మెగా ఫ్యామిలిలో జరిగే పలు ఫంక్షన్స్ కి, నిహారిక, వరుణ్ పార్టీలకు లావణ్య త్రిపాఠి కూడా హాజరవుతున్నట్టు సమాచారం.

Sharwanand : శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం.. జైపూర్ ప్యాలెస్ లో ఆ రోజే..

తాజాగా లావణ్య – వరుణ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. జూన్ మొదటి వారలో వీరి నిశ్చితార్థం ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలీదు. దీనిపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున, మరో సినిమా షూట్స్ లో బిజీగా ఉన్నాడు. లావణ్య త్రిపాఠి ఓ తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి. ఇక దీనిపై క్లారిటీ ఇవ్వాలని వరుణ్, లావణ్య అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.