రాజకీయాల్లోకి వస్తున్నా..ఆ పార్టీలో చేరుతున్నా – లారెన్స్ ట్వీట్

  • Published By: madhu ,Published On : September 6, 2020 / 09:08 AM IST
రాజకీయాల్లోకి వస్తున్నా..ఆ పార్టీలో చేరుతున్నా – లారెన్స్ ట్వీట్

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు నటుడు, దర్శకుడు, కొరియో గ్రాఫర్ లారెన్స్. ఇప్పటికే తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు, కానీ..రాజకీయాల్లోకి వస్తే..మరింత సేవ చేసే అవకాశం కలుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు ఆయన చేసిన సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అయ్యింది.




తాను ఏ పార్టీలో చేరుతాననేది కూడా ప్రకటించాడు. రజనీకాంత్ ఏర్పాటు చేసిన పార్టీలో చేరి..ఆయన దారిలో నడుస్తూ..స్వచ్చమైన రాజకీయాలు చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ర‌జ‌నీకాంత్ విప‌క్ష నాయ‌కుల‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా రాజ‌కీయాలు చేయ‌గ‌లుగుతున్నారని, సాయం చేసిన వారిని విమ‌ర్శించ‌లేనన్నారు.




ర‌జ‌నీకాంత్ పార్టీ మొద‌లు పెడితే ఆయ‌న దారిలోనే పాజిటివ్ దృక్ప‌తంతో ముందుకు సాగుతానంటూ లారెన్స్ త‌న ట్వీట్‌లో వెల్లడించారు. కొన్ని సంవత్సరాలుగా తాను సామాజిక కార్యక్రమాలు చేయడం జరగుతోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల ఎంతోమంది ఫ్యాన్స్ ఏర్పడ్డారని, వీరంతా తాను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు.

కరోనా టైంలో ఇది మరింత ఎక్కువైందని, తాను చేసిన సమాజ సేవకు దివంగత జయలలిత, కరుణానిధితో పాటు స్టాలిన్, పళనిస్వామి ఎంతో సహాయం చేశారన్నారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, ప్ర‌త్య‌ర్ధుల‌పై రాజ‌కీయాలు చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి లేదన్నారు.




ఇక లారెన్స్ విషయానికి వస్తే…నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా పేరొందారు. సినిమా రంగంలో ఉంటూనే…ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నారు.