Pathaan : మోడీ వార్నింగ్‌కి మారిన నాయకులు.. బాయ్‌కాట్ మంచి పద్ధతి కాదంటున్న కేంద్రమంత్రి..

మొన్నటి వరకు రోడ్ల పైకి వచ్చి పఠాన్ సినిమా పై నిరసనలు చేసిన బీజేపీ నాయకులు.. మోడీ వార్నింగ్ తో నేడు బాయ్‌కాట్ మంచి పద్ధతి కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Pathaan : మోడీ వార్నింగ్‌కి మారిన నాయకులు.. బాయ్‌కాట్ మంచి పద్ధతి కాదంటున్న కేంద్రమంత్రి..

pathaan

Pathaan : హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ తరువాత బాలీవుడ్ కి బాయ్‌కాట్ ట్రెండ్ అనే సమస్య ఎదురైంది. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ఆడియన్స్ సినిమాని బాయ్‌కాట్ చేస్తూ వచ్చారు. దీంతో పెట్టిన బడ్జెట్ కూడా రాకపోవడంతో మేకర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. అమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరోనే బాయ్‌కాట్ ట్రెండ్ కి బయపడి సినిమాలకి బ్రేక్ తీసుకున్నాడు. తాజాగా విడుదలైన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీపై కూడా ఈ బాయ్‌కాట్ ఎఫెక్ట్ పడింది. అంతేకాదు కొంతమంది బీజేపీ నాయకులు సైతం ఈ చిత్రం పై విమర్శలు చేశారు.

Pathaan : 3 రోజుల్లో 300 కోట్లు కొల్లగొట్టిన పఠాన్.. 2 రోజుల హాలిడేస్‌లో 500 కోట్ల మార్క్ అందుకుంటాడా?

ఇటీవల మధ్యప్రదేశ్ కి చెందిన ఒక మినిస్టర్.. పఠాన్ విషయంలో సినీ నిర్మాతలను బెదిరించడం రాజకీయం పరంగా చర్చనీయాంశం అయ్యింది. దీని పై ప్రధాని మోడీ స్పందిస్తూ.. అనవసరపు విషయాల పై విమర్శలు చేస్తూ మీడియాలో నిలవకండి అంటూ పార్టీ లీడర్స్ కి మోడీ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ తో బీజేపీ నాయకుల్లో చాలా మార్పే వచ్చింది. తాజాగా బీజేపీ లీడర్ మరియు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ బాయ్‌కాట్ మంచి పద్ధతి కాదంటూ వ్యాఖ్యానించాడు.

బాయ్‌కాట్ ట్రెండ్ అనేది సినీ పరిశ్రమకు మంచి కాదు. సినిమా విషయంలో ఎరికన్నా, ఏమన్నా సమస్య ఉంటే దానిని సంబంధిత ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్ళాలి. అంతేగాని నిరసనలు, నిషేదించడాలు సరి కాదు అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాగా ‘పఠాన్’ చిత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురుకున్నా.. బాక్స్ ఊఫ్స్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. అంతేకాదు కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. మరో రెండు రోజులు వీకెండ్ హాలిడేస్ ఉండడంతో ఈ చిత్రం 500 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా అంటున్నారు సినిమా పండితులు.