K Viswanath Passes Away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.(K. Viswanath)

K Viswanath Passes Away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

K Viswanath passes away : ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.

విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయ్యింది. కె.విశ్వనాథ్ ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది సినీ పరిశ్రమ. సప్తపది, స్వాతిముత్యం, సాగరసంగమం, స్వర్ణకమలం వంటి ఆణిముత్యాలు తీశారు కె.విశ్వనాథ్.

Also Read..Kamal Haasan : తన మాస్టర్‌ని కలుసుకుని.. దీవెనలు తీసుకున్న కమల్ హాసన్..

కె.విశ్వనాథ్ మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. పలువురు ప్రముఖులు కె విశ్వనాథ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.(K Viswanath)

గుంటూరు జిల్లా రేపల్లెలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని విశ్వనాథ్‌ జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కె.విశ్వనాథ్‌ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్‌ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.

Also Read..K Viswanath : సిరివెన్నెల సినిమా నన్ను మానసికంగా చాలా బాధపెట్టింది.. కె విశ్వనాథ్!

కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన ప్రతిభ చూపించారు. తాత, తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటించారు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్‌.. వజ్రం, కలిసుందాం రా, నరసింహనాయుడు, సీమ సింహం, నువ్వు లేక నేను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్‌ వంటి సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కె.విశ్వనాథ్ ను అనేక పురస్కారాలు వరించాయి. 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు కె.విశ్వనాథ్. 1992లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. కె.విశ్వనాథ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పొచ్చు. కళాత్మకమైన, ఎన్నో గొప్ప సినిమాలు ఆయన తీశారు. ఆయన తీసిన క్లాసికల్ సినిమాలు కమర్షియల్ హిట్లయ్యాయి. ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. కె విశ్వనాథ్ తన సినిమాల్లో స్టోరీకి ప్రాధాన్యత ఇస్తారు. దాంతో పాటు సంగీతానికి కూడా ఆయన చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా క్లాసికల్ హిట్ గా నిలిచింది.(K Viswanath)