Mani Ratnam’s PS1: డ్రీమ్ ప్రాజెక్ట్ పీఎస్-1 రిలీజ్ డేట్ ప్రకటించిన మణిరత్నం

లెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ 'పొన్నియన్ సెల్వన్'. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా..

Mani Ratnam’s PS1: డ్రీమ్ ప్రాజెక్ట్ పీఎస్-1 రిలీజ్ డేట్ ప్రకటించిన మణిరత్నం

Mani Ratnam's Ps1

Mani Ratnam’s PS1: లెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చోళుల కాలం నాటి కథాంశంతో తీస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ చిత్రంలో విక్రమ్-కార్తీ-జయం రవి-విక్రమ్ ప్రభు.. ఐశ్వర్యారాయ్-త్రిష-శోభితా ధూళిపాళ్ల-ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Bigg Boss OTT Telugu: నాకు ఇద్దరు.. నాకు ముగ్గురు.. హౌస్‌లో డేటింగ్ హిస్టరీ!

ఆదిత్య కరికాలన్ గా విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ గా జయం రవి, వల్లవ రాయన్ వంద్యదేవన్ గా కార్తి, నందిని అండ్ మందాకిని దేవిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం, కుండవై పిరట్టియార్ గా త్రిష తదితర క్రేజీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మణిరత్నం దాదాపు 500 వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

Raja Goutham: బ్రహ్మానందం కుమారుడి మరో ప్రయత్నం.. ఆకట్టుకున్న గ్లిమ్ప్స్!

ఈ పిరియాడికల్ డ్రామాని ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్పనట్టుగా చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక పాత్రల్లో నటిస్తున్న ఐశ్వర్యారాయ్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లని విడుదల చేసిన యూనిట్ సెప్టెంబర్ 30న సినిమా తీసుకురానున్నట్లు ప్రకటించారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జయ మోహన్ మాటలు రాస్తున్నారు.