Leharaayi : యూత్ లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్నారు..

‘లెహరాయి.. లెహరాయి.. గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి.. లెహరాయి.. లెహరాయి.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి’..

Leharaayi : యూత్ లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్నారు..

Leharaayi

Leharaayi: యంగ్ హీరో అఖిల్ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.

Bigg Boss 5 Telugu : ‘లవ్ స్టోరీ’ కోసం చైతు – సాయి పల్లవి..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.. బుధవారం ఈ సినిమాలోని మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. గోపి సుందర్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా శ్రీమణి లిరిక్స్ రాశారు. యంగ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ చాలా బాగా పాడారు. అఖిల్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. యూత్ లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్నారు ఈ పాటని.

Akhil Akkineni : బ్యా‌చ్‌లర్ బాబు వచ్చేస్తున్నాడు..

‘లెహరాయి.. లెహరాయి.. గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి.. లెహరాయి.. లెహరాయి.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి.. ఇన్ని నాళ్లు ఎంత ఎంత వేచాయి.. కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి.. సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి’.. అంటూ సాగే పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 8న బ్యాచ్‌లర్ బాబు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.