Puri Jagannadh : గోవాలో నెల రోజులు..

సంవత్సరానికి ఈజీగా రెండు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ కెరీర్‌లోనే ‘లైగర్’ హయ్యస్ట్ టైమ్ టేకింగ్ మూవీ..

Puri Jagannadh : గోవాలో నెల రోజులు..

Puri

Puri Jagannadh: సెకండ్ వేవ్ తర్వాత స్టార్లందరూ సినిమాలు స్టార్ట్ చేసి, జెట్ స్పీడ్‌లో ఫినిష్ చేసి రిలీజ్ కూడా చేసేస్తున్నారు. కానీ రౌడీ హీరో మాత్రం ఇంకా ‘లైగర్’ విషయంలో స్లో గానే ఉన్నాడు. రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ‘లైగర్’ పూరీ కెరీర్‌లోనే లాంగెస్ట్ మూవీ. దాదాపు సంవత్సరం నుంచి షూటింగ్ చెయ్యని ‘లైగర్’.. లాంగ్ గ్యాప్ తర్వాత సెట్ మీదకెళ్లబోతున్నాడు.

LIGER

రెండేళ్ల క్రితం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సెకండ్ వేవ్ తర్వాత మ్యాగ్జిమమ్ అందరు హీరోలు షూటింగ్స్‌కి అటెండ్ అయ్యి బ్యాలెన్స్ సినిమాలు కంప్లీట్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ‘లైగర్’ షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్నాడు.

Puri – Charmy: ‘లైగర్’ కోసం పూరి – ఛార్మీ..

కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి గోవాలో షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది. ఇన్నాళ్ల నుంచి హోల్డ్‌లో ఉన్న ‘లైగర్’ ఇప్పుడు నెల రోజుల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ మేజర్ సీన్స్ ఫినిష్ చెయ్యాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు పూరీ అండ్ టీమ్. సంవత్సరానికి ఈజీగా రెండు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్ టైమ్ టేకింగ్ మూవీ.

Nani : ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మామా ఈడికెంచి’..

జనరల్‌గా సినిమాని 3, 4 నెలల్లో కంప్లీట్ చేసే పూరీ.. ఈ సినిమాకు ఇప్పటికే రెండేళ్లు టైమ్ తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే థాయిలాండ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు విజయ్. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు గతంలో అనౌన్స్ చేశారు. కానీ ఇంకా షూటింగ్ అవ్వలేదు కాబట్టి.. సెప్టెంబర్ 9 న సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Natti Kumar : డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళని బ్యాన్ చేయగలరా..?