Liger: మే 9న వేట మొదలుపెడుతున్న లైగర్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్...

Liger: మే 9న వేట మొదలుపెడుతున్న లైగర్

Liger Movie Update On May 9th

Liger: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రానుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తనను తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్న విధానం చూసి ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఈ సినిమాలో ఓ బాక్సర్ పాత్రలో మనకు విజయ్ దేవరకొండ కనిపిస్తాడు.

Liger: లైగర్ నాన్ థియేట్రికల్ రైట్స్‌కు సాలిడ్ ఢీల్..?

ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ మేజర్ అప్‌డేట్‌ను ఇచ్చేందుకు విజయ్ అండ్ టీమ్ రెడీ అయ్యారు. తాజాగా ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘‘వేట మొదలుపెట్టేందుకు అతడు రెడీగా ఉన్నాడు..’’ అంటూ ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మే 9న సాయంత్రం 4 గంటలకు ఈ వేటకు సంబంధించిన వివరాలు తెలియజేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.

Liger Team: పూరీ-చార్మీ.. ఎక్కడ చూసినా ఈ జంట హడావుడే!

విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారేందుకు రెడీ అయ్యాడు. పూరీ తనదైన మార్క్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ తొలిసారి నటిస్తున్న సినిమా లైగర్ కావడం విశేషం. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీతో కలిసి పూరీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆగస్టు 25న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి మే 9న లైగర్ నుండి రాబోయే అప్ డేట్ ఏమిటా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.