Vijay Deavarakonda : ‘లైగర్’ పూర్తి.. నెక్స్ట్ ‘జనగణమన’..??

ఇటీవలే లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టగా ఇవాళ 'లైగర్' సినిమా షూటింగ్ పూర్తి అయింది.దీని గురించి పూరి వాయిస్ తో ఓ పోస్ట్ చేసింది ఛార్మి. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.........

Vijay Deavarakonda :  ‘లైగర్’ పూర్తి.. నెక్స్ట్ ‘జనగణమన’..??

Liger

Vijay Deavarakonda :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కరణ్ జోహార్. ఛార్మి నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘లైగర్’ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా నటించడం విశేషం.

ఇటీవలే లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టగా ఇవాళ ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తి అయింది.దీని గురించి పూరి వాయిస్ తో ఓ పోస్ట్ చేసింది ఛార్మి. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ”ఇప్పుడే లైగర్ షూటింగ్ పూర్తయింది. ఈ రోజుతో జనగణమన” అని పూరి జగన్నాధ్ చెప్పిన వాయిస్ ని ఛార్మి పోస్ట్ చేసింది. దీంతో ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. ఈ సినిమాని ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్టు గతంలోనే తెలిపారు. అయితే ఈ వాయిస్ లాస్ట్ లో ‘జనగణమన’ అనడంతో పూరి మరో హింట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

Lata Mangeshkar : భారతీయ సినిమాకు ఆమె చేసిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది : తమిళిసై సౌందరరాజన్

పూరి జగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాని ఎప్పట్నుంచో మహేష్ బాబుతో చేయాలని చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే మహేష్ తో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. అభిమానులు వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హ్యాట్రిక్ సినిమా జనగణమన అవుతుంది అని అనుకున్నారు. కానీ కొన్ని రోజులుగా ‘జనగణమన’ సినిమాని విజయ్ దేవరకొండతోనే తీస్తారని వార్తలు వచ్చాయి. ఇపుడు ఇచ్చిన వాయిస్ ఓవర్ తో ఈ వార్తలు నిజం చేసినట్లు తెలుస్తుంది.

Pawan Kalyan : హరిహర వీరమల్లు.. మరో అప్డేట్.. తమిళ రచయితతో పవన్..

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా, ఆ తర్వాత రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. పూరికి డేట్స్ ఇవ్వలేదని సమాచారం. దీంతో పూరి ‘లైగర్’ తర్వాత మళ్ళీ ‘జనగణమన’ సినిమాని విజయ్ దేవరకొండతోనే తీద్దామని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. దీనికి ఛార్మి ‘జనగణమన’ హ్యాష్ ట్యాగ్ ని కూడా జతచేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరుతుంది. అయితే దీనిపై మహేష్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తుంటే విజయ్ అభిమానులు మాత్రం ఆనందిస్తున్నారు. మరి ఈ వాయిస్ తో ‘జనగణమన’ సినిమా గురించి క్లారిటీ ఇచ్చినట్టేనా లేక క్యాజువల్ గా చెప్పాడా తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.