Liger: లైగర్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్.....

Liger: లైగర్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

Liger Trailer Launch Date And Time Fixed

Liger: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. పూరీ సినిమాల్లో హీరోకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. దీంతో లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Liger: ‘అక్డీ పక్డీ’ ఫుల్ సాంగ్ రిలీజ్.. రెచ్చిపోయిన లైగర్!

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ వీడియోలు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు అమాంతం పంచేశాయి. ఇక పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ఇండియా వ్యాప్తంగా సినిమా లవర్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించడంతో, ఈ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ

ఇక ఈ సినిమా ట్రైలర్‌ను రెండు చోట్ల నేరుగా లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సుదర్శన్ థియేటర్‌లో జూలై 21న ఉదయం 9 గంటలకు.. అలాగే, ముంబైలోని అంధేరిలో గల సినీపోలిస్‌లో రాత్రి 7.30 గంటలకు లైగర్ ట్రైలర్‌ను లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ విశ్వరూపాన్ని చూసేందుకు ఆడియెన్స్ రెడీగా ఉండాలంటూ చిత్ర యూనిట్ హింట్ కూడా ఇస్తోంది. రోజురోజుకూ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోన్న చిత్ర యూనిట్, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను హీరోయిన్‌గా తీసుకుంది.