Liger: బుల్లితెరపై డేట్ ఫిక్స్ చేసుకున్న లైగర్.. ఎప్పుడొస్తాడంటే?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కట్ చేస్తే.. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది.

Liger: బుల్లితెరపై డేట్ ఫిక్స్ చేసుకున్న లైగర్.. ఎప్పుడొస్తాడంటే?

Liger: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కట్ చేస్తే.. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది.

Also Read: విజయ్ దేవరకొండ వల్లే పూరికి ఈ పరిస్థితి.. బాలీవుడ్ లో కూడా ఇదే టాపిక్..

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌తో లైగర్ చిత్ర నిర్మాతలు భారీగా నష్టపోయారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక ఓటీటీలోనూ ఈ సినిమాకు అంతంతమాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యింది.

Also Read: “పూరీ-డిస్ట్రిబ్యూటర్”ల వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి..

ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రముఖ ఛానల్ ‘స్టార్ మా’లో డిసెంబర్ 11న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీగా వచ్చిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటించగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది. మరి థియేటర్లు, ఓటీటీల్లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయిన లైగర్, బుల్లితెర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాడో చూడాలి.