Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??

ఈ సినిమాలో విజయ్ సమంతల మధ్య లిప్ లాక్ సీన్ ఉన్నట్టు సమాచారం. ఇది లవ్ రొమాంటిక్ సినిమా కావడంతో ఇద్దరూ ఓకే చెప్పేసారు అని తెలుస్తుంది. ఇక విజయ్ సినిమా అంటే లిప్ లాక్......

Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??

Samantha

Samantha :  విజయ్ దేవరకొండ, సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఓ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఖుషి అనే టైటిల్ ని ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల వాళ్ళ ఇద్దరి పుట్టినరోజులు కూడా ఇదే షూట్ లో ఒకరికొకరు స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ టాపిక్ ని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో విజయ్ సమంతల మధ్య లిప్ లాక్ సీన్ ఉన్నట్టు సమాచారం. ఇది లవ్ రొమాంటిక్ సినిమా కావడంతో ఇద్దరూ ఓకే చెప్పేసారు అని తెలుస్తుంది. ఇక విజయ్ సినిమా అంటే లిప్ లాక్ కచ్చితంగా ఉంటుంది అనే ముద్ర ఇప్పటికే పడిపోయింది. సమంత చైతూతో విడాకుల తర్వాత రెచ్చిపోయి ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే, అలాంటిది కిస్ సీన్ సినిమాలో ఉండాలంటే కచ్చితంగా ఓకే చెప్తుంది అంటున్నారు.

BiggBoss Nonstop : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్.. బిందు మాధవి.. అందరూ అనుకున్నదే అయిందిగా..

దీంతో ఈ సినిమాలో లిప్ లాక్ పక్కా అంటున్నాయి సినీ వర్గాలు. గతంలోనూ సమంత టాక్ షోకి విజయ్ గెస్ట్ గా వచ్చినప్పుడు విజయ్ ప్రతి సినిమాలో అందరి హీరోయిన్స్ ని కిస్ చేస్తాడు అని సమంత అంటే నేను ఇంకా సమంతని కిస్ చేయలేదు అని విజయ్ అన్నాడు. అప్పుడే ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. దీంతో ఈ సినిమాలో విజయ్ సమంతకి మధ్య కిస్ సీన్ కచ్చితంగా ఉంటుంది అని సమాచారం. ఇలాంటివి విజయ్ ఫాన్స్ బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ పుష్ప ఐటెం సాంగ్ సమయంలో సమంతని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, మరి కిస్ సీన్ తర్వాత మళ్ళీ సమంతని ట్రోల్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఖుషి సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.