OTT Release: ఈ వారం OTTల్లో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టగా.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసింది. ఈ క్రమంలో సినిమాల షూటింగ్‌లు మొదలవగా.. థియేటర్లు కూడా తెరుచుకున్నాయి.

OTT Release: ఈ వారం OTTల్లో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

Raja Raja Chora

OTT Release: కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టగా.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసింది. ఈ క్రమంలో సినిమాల షూటింగ్‌లు మొదలవగా.. థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. సినిమాలకు మాత్రం ప్రేక్షకులు అంతంత మాత్రమే వస్తున్నారు. కరోనా భయంతో థియేటర్లు తెరచినా భయంతో ప్రేక్షకుల సినిమాలకు రావట్లేదు. ఈ సమయంలో ఓటీటీలలో వచ్చే సినిమాలకు మంచి సపోర్ట్ లభిస్తుంది. ప్రతివారం మాదిరిగానే పలు భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

OTT ప్లాట్‌ఫారమ్‌లు ఈ వారం ఇండియన్ సినిమాలు కంటే ఎక్కువ విదేశీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. OTT ప్లాట్‌ఫామ్‌లు కూడా పండగ సీజన్, హాలిడేస్‌ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రముఖ స్టార్ కాస్ట్‌తో సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సర్దార్ ఉదం, రష్మి రాక్ట్, సునక్ వంటి చిత్రాలు ఉన్నాయి.

ఇవన్నీ థియేట్రికల్ రిలీజ్ కోసం చేసిన సినిమాలు, కానీ కోవిడ్ కారణంగా, నేరుగా OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతున్నాయి. అక్టోబర్ 8న, OTT ప్లాట్‌ఫామ్‌లపై విడుదల కానున్న ఇంగ్లీష్ హారర్ చిత్రాలు ఖచ్చితంగా అలరిస్తాయని చెబుతున్నారు

హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్: (అక్టోబర్ 8)
అక్టోబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో చాలా ముఖ్యమైన డాక్యుమెంటరీ సిరీస్ విడుదల కానుంది – హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్. 2018లో ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11మంది మరణం గురించి అంతుపట్టని రహస్యం ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. సామూహిక ఆత్మహత్యగా అనిపించిన ఈ కేసు మొత్తం ఢిల్లీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ డాక్యుమెంటరీ చిత్రనిర్మాత లీనా యాదవ్. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది.

ది మనోర్, మైడ్రెస్: (అక్టోబర్ 8)
ది బ్లమ్‌హౌస్ ఫ్రాంచైజీ నుండి రెండు హర్రర్ సినిమాలు అక్టోబర్ 8వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్నాయి- ది మనోర్, మైడ్రెస్. ఈ ఫ్రాంచైజీలోని రెండు చిత్రాలు,

రాజ రాజ చోర: (అక్టోబర్ 8)
2021లో విడుదలైన తెలుగు సినిమా రాజ రాజ చోర. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి హసిత్ గోలీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునయన హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అక్టోబర్‌ 8వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇకపై ఇంట్లో సందడి చేయనుంది.

తలైవి: (అక్టోబర్ 10)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా తలైవి. విష్ణువర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహించారు. కంగనా రనౌత్, అరవింద్‌ స్వామి, నాజర్, భాగ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 10న తెలుగు, తమిళం భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

భ్రమం:(అక్టోబర్ 7)
హిందీలో వచ్చిన ‘అంధదూన్’ సినిమాకి ఇది రీమేక్. మలయాళంలో రవి కె చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా నటించాడు. ఇందులో రాశి ఖన్నా హీరోయిన్. హిందీలో ‘టబు’ చేసిన పాత్రను మలయాళంలో మమతా మోహన్ దాస్ చేసింది. ఈరోజు(అక్టోబర్ 7వ తేదీ) నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘అంధదూన్’ రీమేక్ గా ఇటీవల తెలుగులో నితిన్ హీరోగా ‘మాస్ట్రో’ సినిమా వచ్చింది.

‘హమ్ దో హమారే దో’:
ఇక ఇదే నెలలో 29వ తేదీ నుంచి రాజ్ కుమార్ రావ్, కృతీసనన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘హమ్ దో హమారే దో’ స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాని అభిషేక్ జైన్ దర్శకత్వం వహించారు. గతంలో ‘స్త్రీ’, ‘లూకా చుప్పి, బాలా, మిమి’ చిత్రాలను నిర్మించిన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ సంస్థ దీన్ని ప్రొడ్యూస్ చేసింది.