ప్రభాస్ మూవీ బిగ్ అనౌన్స్‌మెంట్: కీలక పాత్రలో బిగ్‌బి.. నాగ్ అశ్విన్ ప్లాన్ ఇదేనా!

  • Published By: sekhar ,Published On : October 9, 2020 / 10:13 AM IST
ప్రభాస్ మూవీ బిగ్ అనౌన్స్‌మెంట్: కీలక పాత్రలో బిగ్‌బి.. నాగ్ అశ్విన్ ప్లాన్ ఇదేనా!

Amitabh Bachchan in Prabhas Movie : రెబల్ స్టార్ ప్రభాస్, ప్రామిసింగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందనున్న ఎపిక్ ఫిల్మ్ కొత్త అప్‌డేట్ వచ్చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. కథానాయికగా బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ దీపికా పదుకొణే ఇప్పటికే ఎంపికయ్యారు.

మరో కీలకపాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. లెజెండ్ లేకుండా లెజెండరీ ఫిల్మ్ ఎలా చేయగలమంటూ Big Surprise పేరుతో ఓ వీడియో విడుదల చేశారు.

ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్ కోసం పనిచేయడానికి పలువురు క్రియేటివ్ పీపుల్ ఒకరి తర్వాత ఒకరుగా వస్తున్నారు. తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక బ్లాక్‌బస్టర్స్ రూపొందించినలెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ జానర్‌లో కొత్త తరహా కథాంశంతో తెరకెక్కనున్న ఈ ఫిల్మ్.. ప్రొడక్షన్లో ఉన్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటనేది నిస్సందేహం.
లార్జర్ దేన్ లైఫ్ మూవీస్, భారీ బడ్జెట్, భారీ తారాగణంతో నిర్మించే చిత్రాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వైజయంతీ మూవీస్ సంస్థ ఈ ఎపిక్ ఫిల్మ్‌ను మరింత భారీ వ్యయంతో, దేశవ్యాప్తంగా పేరుపొందిన తారాగణంతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.