లాక్ డౌన్ సమయంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో క్రైమ్, థ్రిల్లర్ షోలు

లాక్ డౌన్ సమయంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో క్రైమ్, థ్రిల్లర్ షోలు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ మహమ్మారి నివారించే వ్యాప్తిలో భాగంగా దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. దాంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మరికెందుకు ఆలస్యం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆన్ లైన్ ఓటీటీ ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ వీడియో కంటెంట్ అందించే హారర్, థ్రిల్లర్, క్రైమ్ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయండి.

Mr Robot on Prime Videos

mr robot

మిస్టర్ రోబోట్ అనేది డేటా హ్యకర్ గా కొనసాగే ఒక థ్రిల్లర్ మూవీ. ఇతని పేరు ఇలియట్, కొంత కాలంగా మెంటల్లీ డిస్జ్ ఆర్డర్, డిప్రెషన్ సమస్యతో బాధపడతాడు. ఇతను అతిపెద్ద డేటా సెక్కూరిటీ కంపెనీలో డేటా ఆపరేటర్ గా పనిచేస్తాడు. రాత్రి సమయంలో డేటా హ్యాకర్ గా మారిపోతాడు. 
ఈ మూవీలో తారలు రామి మాలెక్, క్రిస్టియన్ స్లేటర్, కార్లీ చైకిన్. డైరెక్టర్ సామ్ ఎస్మెయిల్.

V for Vendetta on Netflix

vendetta

వి ఫర్ వెండెట్టా అని అర్ధం. ఇది ఒక డిస్టోపియన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ లో  ఒక వ్యక్తి ముసుగు ధరించి బ్రిటిష్ పార్లమెంట్ భవనాన్ని నాశనం చేయటానికి ప్రణాళికలు సిద్దం చేస్తాడు. ఇంగ్లాండ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తాడు.
తారాలు : హ్యూగో వీవింగ్ , నటాలీ పోర్ట్ మన్, రూపెర్ట్ గ్రేవ్స్.
దర్శకుడు : జేమ్స్ మెక్ టైగ్.
 
In Time on Prime Videos

in time
ఇన్ టైమ్ అనే మూవీ పూర్తిగా ఫ్యూచర్ సమయంపై కొనసాగుతుంది. ఈ మూవీలో మనుషులందరూ ఐదు సంవత్సరాల వయసులో వృద్దులుగా మార్చబడతారు. అంతేకాకుండా సమయం డబ్బును కొత్త కరెన్సీగా మార్చేసింది. ఇంకా గడియారంలో కేవలం 18 గంటలు మాత్రమే మిగిలి ఉన్న 28 సంవత్సరాల విల్ సలాన్ హత్య చేసినట్లు నింధలను ఎదుర్కొంటాడు. తన ప్రాణాలను కాపాడుకోవటానికి టైమ్ కీపర్ నుండి పరుగెత్తుతాడు.
తారాలు : జస్టిన్ టింబర్ లేక్, అమండా సెయ్ ఫ్రిడ్, సిలియన్ మర్పీ.
దర్శకుడు : ఆండ్రూనికోల్.

Se7en on Netflix

seven

డిటెక్టివ్ డేవిడ్ మిల్స్ రిటైర్డ్ హెూమిసైడ్ స్పెషలిస్ట్ విలియం సోమర్సెట్ తో కలిసి ప్రజలను చంపే యాక్షన్ క్లిలర్ మూవీ. ధనవంతుడైన న్యాయవాదిని హత్య చేయటం. సోమర్సెట్ కోపం, అసూయ కారణంతో జరిగే హత్యలను ఆపడానికి తన పదవీ విరమణను వాయిదా వేసుకోవాలి అనే నేపథ్యంలో కథ కొనసాగుతుంది.
తారాలు : మోర్గాన్ ఫ్రిమాన్, బ్రాడ్ పిట్, కెవిన్ స్పేసీ
దర్శకుుడు : డేవిడ్ ఫించర్ 

Source Code on Apple TV

source code

సోర్స్ కోడ్ మూవీలో ప్రభుత్వం బాంబు పేళ్లు వెనుక ఉన్న ఉగ్రవాదిని తెలుసుకోవడానికి కెప్టెన్ కోల్టర్ స్టీవెన్ అనే వ్యక్తిని మరో వ్యక్తిలోకి ప్రవేశపెట్టంతో కధ ఉంటుంది.
తారాలు : జేక్ గిల్లెన్ హాల్, మిచెల్ మోనాఘన్, వెరా ఫార్మిగా.
దర్శకుడు : డంకన్ జోన్స్.

The girl with a dragon tattoo on Apple TV

dragon tattoo

ఈ కథలో ఒక జర్నలిస్ట్ కంప్యూటర్ హ్యాకర్, పరిశోధకుడిగా నియమించబడతాడు. 40 సంవత్సరాల క్రితం అదృశ్యమైన మహిళ గురించి తెలుసుకోవటానికి నియమించబడతాడు.
తారాలు : డేనియల్ క్రెయిగ్, రూనీ మారా, క్రిస్టోఫర్ ప్లమ్మర్.
దర్శకుడు : డేవిడ్ ఫించర్.

Also Read | ఏపీలో కరోనా పంజా, 329కి చేరిన బాధితులు, 15 గంటల్లో 15 కేసులు