Lokesh Kanagaraj: సోషల్ మీడియాకు లోకేశ్ కనగరాజ్ బ్రేక్..!

తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇటీవల ‘విక్రమ్’ మూవీతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. అయితే తాజాగా, ఈ డైరెక్టర్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌కు కొద్దిరోజులు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు.

Lokesh Kanagaraj: సోషల్ మీడియాకు లోకేశ్ కనగరాజ్ బ్రేక్..!

Lokesh Kanagaraj: తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు ఇటీవల మార్మోగిపోతుంది. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో స్టార్ హీరో కమల్ హాసన్ చాలా రోజుల తరువాత అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక విక్రమ్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఈ డైరెక్టర్ నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Lokesh Kanagaraj : మిమ్మల్ని కలుస్తాను.. విక్రమ్ డైరెక్టర్ తో మహేష్ మీట్.. సినిమా ఛాన్స్?

ఈ క్రమంలో లోకేశ్ కనగరాజ్ తన నెక్ట్స్ చిత్రాన్ని మరోసారి స్టార్ హీరో విజయ్‌తో తెరకెక్కించనున్నాడనే వార్త కోలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపించింది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ డైరెక్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తన సోషల్ మీడియా అకౌంట్స్‌కు కొన్ని రోజులు దూరంగా ఉండబోతున్నట్లు ఈ డైరెక్టర్ పేర్కొన్నాడు. తన నెక్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్‌తో తిరిగి వస్తానంటూ ఈ డైరెక్టర్ తన అభిమానులకు తెలిపాడు.

Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?

ఇక లోకేశ్ చేసిన ఈ ట్వీట్‌తో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఆయన నెక్ట్స్ మూవీని త్వరలోనే ప్రకటిస్తారని అందరూ అనుకుంటే, లోకేశ్ ఈ విధంగా సడెన్‌గా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే లోకేశ్ తిరిగి ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలోకి వస్తాడా.. ఆయన తన నెక్ట్స్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.