Lokesh kanagaraj : తమిళ్ లో అందరి చూపు ఇతని మీదే.. పదేళ్ల వరకు ఢోకా లేదంటున్న లోకేష్ కనగరాజ్..

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అంటున్నాడు లోకేష్ కనగరాజ్. కెరీర్ స్టార్ట్ చేసి గట్టిగా 6 ఏళ్లయ్యిందో లేదో తమిళ్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు . చిన్న సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొట్టిన లోకేష్ లేటెస్ట్ గా................

Lokesh kanagaraj : తమిళ్ లో అందరి చూపు ఇతని మీదే.. పదేళ్ల వరకు ఢోకా లేదంటున్న లోకేష్ కనగరాజ్..

Lokesh kanagaraj the new star in Tamil Film Industry set new records

Lokesh kanagaraj :  ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అంటున్నాడు లోకేష్ కనగరాజ్. కెరీర్ స్టార్ట్ చేసి గట్టిగా 6 ఏళ్లయ్యిందో లేదో తమిళ్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు . చిన్న సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొట్టిన లోకేష్ లేటెస్ట్ గా లియోతో మాస్టర్ ని మరిపిస్తానంటున్నాడు. సౌత్ మొత్తం సత్తాచూపిస్తానంటున్నాడు. శంకర్, వినోత్, కార్తిక్ సుబ్బరాజ్, శివ లాంటి సీనియర్ స్టార్ డైరెక్టర్లకు చెక్ పెట్టేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఖైదీ సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అయిన లోకేష్ కనగరాజ్ ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా సక్సెస్ లుకొట్టామా లేదా అంటూ సవాల్ విసురుతున్నాడు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా గ్యాప్ లేకుండా షూటింగ్స్ మొదలుపెడుతూ సక్సెస్ లు కొడుతూ తమిళ్ స్టార్ డైరెక్టర్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు.

లోకేష్ కనగరాజ్ కెరీర్ లో ఇప్పటి వరకూ చేసిన 5 సినిమాలూ సూపర్ హిట్లే. ఈ రేంజ్ లో హిట్ ఫామ్ లో ఉన్న లోకేష్ కనగరాజ్ మరోసారి స్టార్ హీరో విజయ్ తో లియో మూవీ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మాస్టర్ మూవీతో విజయ్ తో కలిసి సూపర్ హిట్ కొట్టిన లోకేష్ మరోసారి లియో.. బ్లడీ స్వీట్ అంటూ ఇంటెన్స్ యాక్షన్ మూవీ తో రానున్నాడు. సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తున్న డైరెక్టర్లున్న ఈ టైమ్ లో ఈ సంవత్సరం సినిమా మొదలుపెట్టి అక్టోబర్ 19 న రిలీజ్ అంటూ డేట్ కూడా అనౌన్స్ చేసి ఫాన్స్ కి స్వీట్ షాకిచ్చాడు.

6 ఏళ్లు.. 5 సినిమాలు.. తమిళ్ ఇండస్ట్రీ గ్రాఫ్ ని మార్చేస్తున్నాడు లోకేష్. స్టార్ హీరోల కెరీర్ కి మంచి మైలేజ్ ఇస్తున్నాడు లోకేష్ కనగరాజ్. అవియల్, మానగరం సినిమాలతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా నలుగురి దృష్టిలో పడ్డా ఖైదీతో మాత్రం సూపర్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. ఏమాత్రం కమర్షియల్ యాస్పెక్ట్స్ లేకుండా స్టోరీ బేస్డ్ మూవీ గా వచ్చిన ఖైదీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అమ్మేస్తారు సినిమాతో పక్కా కమర్షియల్ సినిమాలు తీసి కూడా హిట్ కొట్టగలను అని ప్రూవ్ చేశాడు.

ఖైదీ మేకింగ్ తోనే సర్ ప్రైజ్ అయిన జనానికి విక్రమ్ తో మరోసారి సర్ ప్రైజ్ చేశాడు. స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ లో టాప్ స్టార్స్ ని సూపర్ గా హ్యాండిల్ చేశాడు లోకేష్. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య ఇలా టాప్ స్టార్ కాస్ట్ ని అంతే ఈజ్ గా సరికొత్తగా ఆడియన్స్ కి ప్రజెంట్ చేశాడు. లోకేష్ టాలెంట్ తో పాటు విక్రమ్ స్టోరీకి ఫుల్ ఫిదా అయిన ఫాన్స్ 450 కోట్లకు పైగా కలెక్షన్లతో సినమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.

లోకేష్ లాస్ట్ ఇయర్ విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా సక్సెస్ ని కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు విజయ్ తో లియో స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలతో పాటు ఖైదీ, విక్రమ్, లియో ఇలా 3 సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి దీనికి కంటిన్యూగా కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఖైదీ 2, విక్రమ్ 2, సూర్యతో ఓ సినిమా ఉండబోతుందని లోకేష్ ప్రకటించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఇంకా ఓ పదేళ్ల దాకా ఢోకా లేదు అని, అప్పటిదాకా స్టోరీలు ఉన్నాయని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Kalyan Ram : నెగిటివిటీ వర్కవుట్ అవుతుందంటున్న కళ్యాణ్ రామ్..

కాన్సెప్ట్ మూవీస్ తో పాటు కమర్షియల్ కంటెంట్ ని కూడా అందిస్తూ అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న లోకేష్ తో సినమాలు చెయ్యడానికి సౌత్ లో మిగతా స్టార్ హీరోలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మిగతా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న టాప్ డైరెక్టర్లు స్టోరీ కోసం, సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే లోకేష్ మాత్రం సూపర్ స్పీడ్ లో సినిమాలతో పాటు సక్సెస్ లు అందుకుంటున్నాడు. మొత్తానికి తమిళ్ లో ఇటు సినిమా పరిశ్రమతో పాటు, ప్రేక్షకులని కూడా తనవైపుకు తిప్పుకున్నాడు. తమిళ్ లోనే కాదు తన సినిమావులతో వేరే భాషల్లో కూడా అభిమానులని సంపాదించుకున్నాడు లోకేష్. అలాగే తెలుగులో కూడా లోకేష్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు గతంలో చెప్పాడు. మరి తెలుగులో ఏ స్టార్ హీరోతో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.