Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా...

Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?

Lokesh Kanagaraj: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇటీవల ఫిక్స్ చేశారు. ఇక పూర్తి ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రాబోతున్నట్లు టైటిల్‌ని బట్టి అంచనా వేస్తున్నారు ఆడియెన్స్. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే, విజయ్ తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Lokesh Kanagaraj : ఖైదీ, మాస్టర్, విక్రమ్….. వాట్స్ నెక్స్ట్ లోకేష్ కనగరాజ్??

విజయ్‌తో గతంలో మాస్టర్ అనే సినిమాను తీసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న లోకేశ్ కనగరాజ్, ఇటీవల విక్రమ్ సినిమాతో తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ డైరెక్టర్ విజయ్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈసారి విజయ్ కోసం పక్కా మాఫియా కథను రెడీ చేస్తున్నాడట ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమా నేపథ్యం పూర్తిగా ముంబై ప్రాంతంలో జరుగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Lokesh Kanagaraj : ఖైదీ 2.. సూర్య వర్సెస్ కార్తీ.. విక్రమ్ తో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు లోకేష్..

ఈ సినిమాలో విజయ్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందకు రెడీ అవవుతున్నాడట. మరి నిజంగానే ఈ సినిమా కోసం లోకేశ్ తన మాకం మార్చనున్నాడా అనేద చూడాలి. ముంబై ఏరియాలో అయితే మాఫియా నేపథ్యం పక్కాగా మ్యాచ్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా భావిస్తుందట. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా.. ఈ సినిమాలో మిగతా నటీనటులు ఎవరనే విషయాలు తెలియాల్సి ఉంది.