Lokesh Kanagaraj : ఒక్క ఛాన్స్ అంటూ.. తెలుగు స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ డైరెక్టర్
తమిళ్ లో వరుస విజయాలతో ఉన్న లోకేష్ తెలుగులో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. యువ డైరెక్టర్స్ కి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి లైన్ లో....................
Lokesh Kanagaraj : అడ్వాన్స్ ఇచ్చేశారు. కథ కూడా వినిపించేశారు. ఇంకేముంది సినిమా అనౌన్స్ చేస్తారనుకున్నారు. కానీ అసలు అడ్రెస్ లేకుండా పోయాడు తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తమిళ్ లో ఖైదీ, మాస్టర్ సినిమాలతో విజయం సాధించిన లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో రానున్నాడు. తమిళ్ లో మంచి హిట్ ట్రాక్ ఉన్న ఈ డైరెక్టర్ తెలుగులో మాత్రం ఎప్పట్నుంచో ఎంట్రీ ఇద్దామనుకున్న కుదరట్లేదు.
తమిళ్ లో వరుస విజయాలతో ఉన్న లోకేష్ తెలుగులో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. యువ డైరెక్టర్స్ కి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి లైన్ లో పెట్టుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్ లోకేష్ పనితనం చూసి ఇతనికి కూడా అడ్వాన్స్ ఇచ్చింది. ఇంకేముంది లోకేష్ ఎంట్రీ తెలుగులో ఖాయం అని ఫిక్స్ అయ్యారు. రామ్ చరణ్ డేట్స్ కూడా మైత్రి దగ్గర ఉండడంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక యాక్షన్ మూవీ చేద్దామని ఫిక్స్ అయ్యారు. దీంట్లో భాగంగానే చరణ్ కి కథ కూడా చెప్పారు లోకేష్. అయితే చరణ్ కి కథ అంతగా నచ్చకపోవడంతో ప్రస్తుతానికి ఈ సినిమాని పక్కన పెట్టేశారు.
Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..
సరే చరణ్ కాకపోతే ఇంకో హీరో అని సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా కలిసి స్టోరీ లైన్ చెప్పారు లోకేష్. కానీ మహేష్ అంతకుముందు మురుగదాస్ లాంటి తమిళ్ డైరెక్టర్ తో స్పైడర్ లాంటి ఫ్లాప్ సినిమా చేసిన అనుభవం ఉండడంతో తమిళ్ డైరెక్టర్లతో సినిమా కమిట్ అయ్యే ముందు కాస్త ముందూ వెనకా గట్టిగానే చూస్కోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే లోకేష్ చెప్పిన కథకి కూడా ఓకే చెప్పకుండా హోల్డ్ లో పెట్టారు మహేష్. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలన్న లోకేష్ ప్రయత్నాలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం విక్రమ్ తర్వాత విజయ్ తో మరో సినిమా ఓకే చేసుకున్నాడు లోకేష్. మరి తెలుగులో ఏ హీరోతో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి. తెలుగులో ఆల్రెడీ మైత్రి సంస్థ అడ్వాన్స్ ఇచ్చింది కాబట్టి కచ్చితంగా భవిష్యత్తులో అయినా తెలుగు సినిమా చేస్తాడు లోకేష్.