డిసెంబరులో అమెజాన్‌లోకి రానున్న సినిమాలివే

డిసెంబరులో అమెజాన్‌లోకి రానున్న సినిమాలివే

కొత్త కొత్త సినిమాలను ఈ-కామర్స్ ప్లాట్ ఫాంపైకి తీసుకొస్తున్న అమెజాన్ డిసెంబరులో టీవీ షోలతో పాటు నేషనల్, ఇంటర్నేషనల్ మూవీస్‌తో సిద్ధమైపోయింది. ఈ మేర కొత్త సినిమాలను సైతం అందుబాటులోకి తెస్తున్నారు. ఒక నెల ముందు విడుదలైన సూపర్ డూపర్ హిట్ అయిన వార్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాను అమెజాన్ యాప్‌లో చూడొచ్చు. 

భారత సైనిక పాత్రల్లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కనిపించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అమెజాన్ ప్రైమ్ అందిస్తుంది. మిగిలిన సినిమాల జాబితా ఇలా ఉంది.

1. వార్ (హిందీ, తెలుగు, తమిళం) – యాక్షన్  
మాజీ మెంటార్‌ను హతమార్చేందుకు భారత్ ఆర్మీ మరో సైనికుడిని నియమిస్తుంది. వీరిద్దరి మధ్య ఉండే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్. 

new-releases-amazon-prime-video

 
2. గంటుమూటె (కన్నడ) – ఎమోషనల్ డ్రామా

సినిమా ఆసాంతం టీనేజర్ మీరా హైస్కూల్‌ జీవితంలోని తన తొలి ప్రేమ గురించి చెబుతూ ఉంటుంది. ఆమె ప్రేమకథను ఓ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. 

new-releases-amazon-prime-video

3. ట్రిపుల్ సీట్ (మరాఠీ) – ట్రైయాంగిల్ లవ్ స్టోరీ
ముగ్గురు మధ్య జరిగిన ప్రేమ కథను సస్పెన్స్ థ్రిల్లర్ గా మార్చిన సినిమా ఇది. 

new-releases-amazon-prime-video

4. గుమ్నామీ (హిందీ) – మిస్టరీ స్టోరీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం తర్వాత జరిగిన కథ ఇది. 1999 నుంచి 2005వరకూ ఏం జరిగిందోనని ముఖర్జీ కమిషన్ ఏర్పాటు గురించి తెలిపిన కథాంశం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న మిస్టరీ గురించి చెప్పే సినిమా. 

new-releases-amazon-prime-video

5. ఏ వెరీ ఇంగ్లీష్ శాండల్ (ఇంగ్లీష్) – కామెడీ 
ఇదొక కామెడీ సినిమా. మూడు పార్టులుగా తీసిన టెలివిజన్ కామెడీ ప్రోగ్రాం. తన మాజీ ప్రేయసిని హత్యచేసిన నిందితుడిగా లీడ్ రోల్ సాగుతుంటే అతనిపై కౌంటర్లు విసురుతూ సినిమా సాగుతుంది. 

new-releases-amazon-prime-video

6. ద రిపోర్ట్ (ఇంగ్లీష్) – యాక్షన్

9/11దాడుల తర్వాత జరిగిన ఘటనలు, ఓ ఎఫ్‌బీఐ ఏజెంట్ కోణంలో తీసిన సినిమా ఇది. 

new-releases-amazon-prime-video