Radhe Shyam: నష్టాలపాలైన బయ్యర్లు.. రాధేశ్యామ్ ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!

రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్దకు వచ్చి ఆశించిన స్థాయిలో..

Radhe Shyam: నష్టాలపాలైన బయ్యర్లు.. రాధేశ్యామ్ ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!

Radhe Shyam

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్దకు వచ్చి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. తొలి రోజు నుండే డివైడ్ టాక్‌ ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ లో వసూళ్ల హవా కనిపించింది. తొలి మూడు రోజులలోనే రాధేశ్యామ్ సినిమా భారీ వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ పోస్టర్ల ద్వారా ప్రకటించగా లాంగ్ రన్ లో మాత్రం జోరు లేకుండా పోయింది.

Radhe Shyam: రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్లపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌లో క‌లెక్ష‌న్లు బాగానే ఉన్నా వీక్ డేస్‌లో మాత్రం భారీగా తగ్గిపోయాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఉత్తరాదిన హవా కొనసాగడం కూడా రాధేశ్యామ్ కలెక్షన్స్‌పై బాగానే ప్రభావం చూపించింది. మొత్తంగా రాధే శ్యామ్ బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తుంది.

Radhe Shyam: మునిగిన బయ్యర్లు.. నష్టాలను పూడ్చేపనిలో ప్రభాస్?

విడుదలకు ముందే రాధే శ్యామ్ సినిమాకి రూ.208 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. దీంతో రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బ‌రిలోకి దిగిన సినిమా ఫైన‌ల్‌గా రూ.83.12 కోట్ల షేర్ కలెక్ష‌న్ల‌ను సాధించింది. ఇది ఫుల్‌ర‌న్ ముగిసే స‌రికి రూ.126 కోట్ల వ‌ర‌కు సాధించడంతో సినిమా కొన్న బ‌య్య‌ర్స్ నష్టాల‌పాలైనట్టు తెలుస్తుంది. రాధే శ్యామ్ ఫైనల్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం – 24.80 కోట్లు
సీడెడ్ – 7.46 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 4.90 కోట్లు
గుంటూరు – 4.50 కోట్లు
ఈస్ట్ – 4.34 కోట్లు
వెస్ట్ – 3.32 కోట్లు
కృష్ణ – 2.71 కోట్లు
నెల్లూరు – 2.14 కోట్లు

ఏపీ+తెలంగాణ = 54.17 కోట్లు (84.60కోట్ల గ్రాస్‌)
త‌మిళ‌నాడు = 0.76 కోట్లు
కేర‌ళ = 0.18 కోట్లు
కర్ణాట‌క = 4.20 కోట్లు
హిందీ = 10.70 కోట్లు
ఓవ‌ర్సీస్ = 11.42 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ కలెక్షన్స్ = 83.12 కోట్లు (151కోట్ల‌ గ్రాస్‌)