లవ్ ఆజ్ కల్ 2 – ట్రైలర్

‘లవ్ ఆజ్ కల్’ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘లవ్ ఆజ్ కల్ 2’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

10TV Telugu News

‘లవ్ ఆజ్ కల్’ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘లవ్ ఆజ్ కల్ 2’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

దాదాపు 11 ఏళ్ల క్రితం సైఫ్ అలీ ఖాన్, దీపిక పదుకొనే జంటగా.. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ ఆజ్ కల్’.. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లవ్ ఆజ్ కల్ 2’ మూవీని తెరకెక్కిస్తున్నారు ఇంతియాజ్ అలీ.

కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తుండగా.. రణదీప్ హుడా, ఆరుషి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దినేష్ విజాన్, ఇంతియాజ్ అలీ నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘లవ్ ఆజ్ కల్ 2’ ట్రైలర్ రిలీజ్ చేశారు. నేటితరం యువత జీవన విధానానికి, ప్రేమకు, అద్దం పట్టేలా ఉందీ ట్రైలర్.

కార్తీక్, సారాల కెమిస్ట్రీ బాగుంది. వాళ్ల రొమాన్స్ యువతరానికి నచ్చేలా ఉంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. వాలైంటెన్స్ డే కానుకగా 2020 ఫిబ్రవరి 14న ‘లవ్ ఆజ్ కల్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు.