Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ..

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

Love Story Review

Love Story Review: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మించాయి.
కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..

కథ…
ఆర్మూరులో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రేవంత్ (నాగ చైతన్య) కష్టపడి చదువుకుని హైదరాబాద్‌లో సొంతగా జూంబా సెంటర్ నడుపుతుంటాడు. బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తూ. ఆర్థిక ఇబ్బందులు పడుతుంటాడు. అదే ఊరికి చెందిన మౌనిక జాబ్ కోసం వచ్చి ఫ్రెండ్ ఫ్లాట్‌లో ఉంటుంది. తన డ్యాన్స్ నచ్చిన హీరో జూంబాలో జాయిన్ అవమని చెప్తాడు. ఇంట్లో నాన్నమ్మ, బాబాయ్ పోరు భరించలేక జాబ్ జాయిన్ అయ్యానని అబద్ధం చెప్పి రేవంత్ జూంబా సెంటర్‌లో క్లాసెస్ చెప్తుంటుంది. మౌనిక వచ్చిన తర్వాత జూంబా సెంటర్ బాగా డెవలప్ అవుతుంది.

Samantha – Chaitanya : ఇద్దరి మధ్య ఏం జరిగింది..?

ఈ క్రమంలో రేవంత్ – మౌనిక ప్రేమలో పడతారు. తక్కువ కులానికి చెందిన రేవంత్‌తో పెళ్లి అంటే ఇంట్లోవాళ్లు ఒప్పుకోరు. పైగా బాబాయ్ చంపేస్తాడనే భయంతో ఉంటుంది మౌనిక. ఆర్మూర్‌కి చెందిన ఎస్సై (ఉత్తేజ్) మౌనిక చనిపోయినట్లు ఫేక్ ఆధారాలతో నమ్మిద్దాం. ఓ ఆరు నెలల పాటు ఇద్దరూ కాంటాక్ట్‌లో ఉండొద్దు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోండి అని సలహా ఇస్తాడు. ఆ సలహాతో మౌనిక ఊరికెళ్లిపోతుంది. రేవంత్ దుబాయ్ వెళ్తాడు. 6 నెలల తర్వాత దుబాయ్ నుంచి తిరిగొచ్చి పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు రేవంత్. కట్ చేస్తే మౌనిక రిజిస్టర్ ఆఫీస్‌కి రాదు. ఆమె ఎందుకలా చేసింది.. రేవంత్ -మౌనిక ఒక్కటయ్యారా.. వీళ్ల విషయం తెలిసిన మౌనిక బాబాయ్ ఏం చేశాడు.. రేవంత్ జైలుకి ఎందుకెళ్లాడు అనే ఆసక్తికరమైన విషయాలు సినిమా చూసి తెలుసుకోవలసిందే..

Chiranjeevi : సాయి పల్లవిని మెగాస్టార్ మామూలుగా ఏడిపించలేదుగా..!

నటీనటులు…
నాగ చైతన్య కెరీర్‌లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. తెలంగాణ కుర్రాడిగా రేవంత్ క్యారెక్టర్‌‌లో ఒదిగిపోయాడు. మేకోవర్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఇలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపించాడు. సాయి పల్లవితో పోటీ పడుతూ పర్ఫార్మ్ చేశాడు.

Chai

సాయి పల్లవి ఎప్పటిలానే తన స్టైల్ నటనతో ఆకట్టుకుంది. ‘ఫిదా’ లో తెలంగాణ అమ్మాయిగా నటించి ఆ సినిమా సక్సెస్‌‌లో కీలకంగా నిలిచిన సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ తో మరోసారి మెప్పించింది. ‘నీకు హార్ట్ లేదబ్బా’ అనే ఊతపదంతో ఆకట్టుకుంది. రేవంత్ తల్లిగా చేసిన ఈశ్వరీ రావు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మౌనిక తల్లిగా దేవయాని క్యారెక్టర్ బాగుంది. రాజీవ్ కనకాల చాలా రోజుల తర్వాత నెగెటివ్ రోల్‌లో అలరించాడు. ఉత్తేజ్‌తో సహా మిగతా నటీనటులంతా తమ క్యారెక్టర్లలో చాలా బాగా యాక్ట్ చేశారు.

టెక్నీషియన్స్…
విజయ్ సి.కుమార్ ఫొటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారాయన. ఇక ఆయన తనయుడు పవన్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. సినిమా ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్‌లోనూ సందర్భానికి తగ్గట్టు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు. ఇక పాటల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. స్క్రీన్ మీద మరింత అందంగా ఉన్నాయి పాటలు. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది.

Love Story

శేఖర్ కమ్ముల కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ ‘లవ్ స్టోరీ’ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి.. ఫీల్ గుడ్ మూవీస్ తీసే శేఖర్.. ఈరోజుల్లో కూడా అంటరానితనం ఉందా అనే కోణంలో.. మన చూట్టూ జరిగే, మనకు తెలిసిన అంశఆలనే కథగా రాసుకున్నారు. ప్రేమ, దానికి ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ చేసి సినిమాను అందంగా మలిచారు. ముఖ్యంగా ఆయన రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. స్క్రీన్‌ప్లే పరంగా కాస్త సాగదీసినట్లుంది కానీ శేఖర్ శైలి తెలిసిన వాళ్లు పెద్దగా బోర్ ఫీలవరు. పాండమిక్ తర్వాత ఓవర్సీస్‌తో పాటు భారీ స్థాయి థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా ‘లవ్ స్టోరీ’ నే.. ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకొచ్చారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా చూసి చాలా కాలం అయిందంటూ ప్రేక్షకులు ‘లవ్ స్టోరీ’ కి పాజిటివ్ టాక్ చెప్తున్నారు.