Love Today: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసిన ‘లవ్ టుడే’.. ట్విస్టు మాత్రం మామూలుగా లేదుగా!

మిళంలో తెరకెక్కిన ‘లవ్ టుడే’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించగా, పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా ఈ సినిమా వచ్చింది. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నవంబర్ 25న తెలుగు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.

Love Today: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసిన ‘లవ్ టుడే’.. ట్విస్టు మాత్రం మామూలుగా లేదుగా!

Love Today Locks OTT Release Date

Love Today: తమిళంలో తెరకెక్కిన ‘లవ్ టుడే’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించగా, పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా అక్కడ అనుకోని విధంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని, అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

Love Today : ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ లవ్ టుడే..

కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లవ్ టుడే సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.60 కోట్ల మేర వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఇక ఈ సినిమా అక్కడ సాధించిన ఘన విజయాన్ని చూసి, తెలుగులో ఈ సినిమాను ఇటీవల రిలీజ్ చేశారు. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నవంబర్ 25న తెలుగు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు వెళ్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ లవ్ టుడే చిత్రాన్ని డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ ఓ ట్విస్ట్ ఇచ్చింది. ఈ సినిమాను కేవలం తమిళ్‌లోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో తెలుగులో లవ్ టుడే సినిమాను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.