MAA Elections: ‘మా’ ఎన్నికల్లో.. ఓటు వేయని బడా హీరోలు వీరే!

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికలలో పోలింగ్ ఎట్టకేలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్లో ముగిశాయి. గత మూడు నెలలుగా...

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో.. ఓటు వేయని బడా హీరోలు వీరే!

Maa Elections

MAA Election: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికలలో పోలింగ్ ఎట్టకేలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్లో ముగిశాయి. గత మూడు నెలలుగా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్‌ జరిగింది. గతేడాది కేవలం కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి మాత్రం 666 మందికి పైగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.

MAA Elections: ముగిసిన మా ఎన్నికలు.. ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయంటే?

ఈ ఎన్నికలలో టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్‌, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలతో పాటు సీనియర్ నటులు, జయప్రద, జెనీలియా లాంటి ఇతర రాష్ట్రాలలో ఉన్న నటులు కూడా ఈ ఎన్నికల కోసం హైదరాబాద్ వచ్చి ఓటేశారు. అయితే.. దాదాపు మూడు వందల మంది మా సభ్యులు ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇందులో స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేశ్‌బాబుతో పాటు సీనియర్ హీరోలు వెంకటేశ్‌ వంటి వారున్నారు.

MAA Elections : మా ఎన్నికల్లో ఎందుకింత రగడ ?

ఇక నితిన్‌, రానా, రవితేజ, నాగ చైతన్య వంటి అగ్ర హీరోలు మాత్రం ఓటు వేయడానికి రాలేదు. ఇక హీరోయిన్స్‌లలో అనుష్క, సమంత, రకుల్‌, ఇలియానా, త్రిష, హన్సికలు కూడా ఈ ఓటింగ్‌కు దూరంగా ఉ‍న్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో షూటిం‍గ్స్‌లో బిజీగా ఉండటంతో ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తుంది. కాగా సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెకింపు ప్రారంభం కానుండగా.. రాత్రి 8గంటల వరకు ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.