MAA Hema : నరేష్.. రూ.5కోట్లలో రూ.3కోట్లు ఖర్చు పెట్టేశారు, వైరల్‌గా మారిన నటి వాయిస్ మేసేజ్

‘మా’లో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది? ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష బరిలో ఉన్న నటి పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ వాయిస్ మెసేజ్‌లో ఆమె మా’ అధ్య‌క్షుడు న‌రేష్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

MAA Hema : నరేష్.. రూ.5కోట్లలో రూ.3కోట్లు ఖర్చు పెట్టేశారు, వైరల్‌గా మారిన నటి వాయిస్ మేసేజ్

Maa Hema

MAA Hema : ఎప్పటిలాగే ‘మా’ ఎన్నికల వ్యవహారం మరోసారి హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. ఇప్పటిదాకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. అధ్యక్ష పోటీలో ఐదుగురు బరిలోకి దిగడం సినీ వర్గాల్లో పెద్ద ఇష్యూ అయింది. ఇక ఈ పోటీలో నిలిచిన వారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వారు చేసే కామెంట్స్ కొత్త చర్చలకు ఊతమిస్తున్నాయి. తాజాగా ‘మా’లో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది? ప్రస్తుతం పదవీ కాలం పూర్తయిందని, వెంటనే ఎన్నికలు జరపాలని కోరుతూ క్రమశిక్షణా సంఘానికి కొందరు ‘మా’ సభ్యులు లేఖలు రాస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష బరిలో ఉన్న హేమ పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ వాయిస్ మెసేజ్‌లో ఆమె మా’ అధ్య‌క్షుడు న‌రేష్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌ధానంగా ‘మా’ ఎన్నిక‌ల‌ను వెంట‌నే పెట్టాల‌నే డిమాండ్ అందులో ఉన్న‌ప్ప‌టికీ, మ‌రోవైపు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌రేష్‌పై విమ‌ర్శ‌లున్నాయి. దీంతో ఈ వాయిస్ మెసేజ్‌కు ప్రాధాన్యం ల‌భించింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హేమ వాయిస్ వైర‌ల్ అవుతోంది.

‘మా’ ఎన్నిక‌ల అంశం తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టాలీవుడ్‌లో వ‌ర్గాలుగా విడిపోయి రాజ‌కీయాలు మాట్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా అధ్య‌క్ష బ‌రిలో ఉన్న మంచు విష్ణు ఇటీవ‌ల సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ న‌టులు మౌనంగా ఉంటున్న‌ప్ప‌టికీ, అంత‌ర్గ‌తంగా తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇక హేమ వాయిస్ మెసేజ్ విష‌యానికి వ‌స్తే… అందులో ప్ర‌ధానంగా ఏముందో చూద్దాం.

‘హాయ్ అండి.. ఈ మెసేజ్ నేను ఒక్కొక్కరికి కాకుండా కామన్‌గా చెప్పేస్తున్నా. 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నా. ఏం లేదు ‘మా’ ఎలక్షన్స్ పెట్టకూడదు. నరేష్‌గారే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని అవతలి వారు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. నరేష్ గారు మొత్తం ఉన్న రూ. 5కోట్లలో రూ. 3కోట్లు ఖర్చు పెట్టేశారు.

పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. ఇది వరకు ఏంటంటే.. ఆఫీస్ ఖర్చులు బయటి నుంచి తీసుకొచ్చి, మేము ఫండ్ రేజ్ చేసి ఇచ్చే వాళ్లం. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు.

ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు… ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు. కాబట్టి మనమందరం ఎలక్షన్స్ కావాలి అని ఈ లెటర్. నేను మనిషిని పంపిస్తాను.. మీరు సంతకం చేసి పంపిస్తే.. నేను ‘మా’ అసోసియేషన్‌కి సబ్మిట్ చేస్తా. ఆ లెటర్‌లో ఉన్న మ్యాటర్, నేను చెప్పే మ్యాటర్ ఒకటే. ప్లీజ్ అందరూ ఎలక్షన్ కావాలని మాత్రం చెప్పండి’ అని వాయిస్ మెసేజ్ ద్వారా హేమ అప్పీల్ చేశారు.

కాగా నరేష్ పై హేమ చేసిన విమర్శలను, ఆరోపణలను నరేష్ సన్నిహితులు ఖండించారు. ఎవ‌రికో మేలు చేసేందుకే హేమ వాయిస్ మెసేజ్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

ఇప్పటి వరకు మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లే ఈ ‘మా’ ఎన్నికల విషయంలో హైలెట్ అవుతూ, వారి మధ్యనే పోటీ అనేలా వాతావరణం క్రియేట్ అవుతోంది. తాజాగా హేమ వాయిస్‌లో వైరల్ అవుతున్న వాయిస్ మెసేజ్ ద్వారా ‘మా’ ఎన్నికలు కొత్త మలుపులు తిరగబోతున్నాయనేది అర్థమవుతోంది. ‘మా’ ఎన్నికలు వెంటనే జరగాలి-నరేష్ దిగిపోవాలి అన్నట్లుగా ఈ వాయిస్ మెసేజ్‌లో హేమ మాట్లాడారు. ఎన్నికలు జరిగితే అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి ఆల్రెడీ ఐదుగురు రెడీగా ఉన్నారు.

మరోవైపు ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న ‘మా’ బాడీకి అన్ని అధికారాలు ఉన్నట్లేనని న్యాయ నిపుణులు చెప్పేశారు. దీంతో ‘మా’ ఎన్నికలు ఇప్పుడప్పుడే జరగకూడదనేలా కొందరు పావులు కదుపుతున్నారనేలా.. టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ హేమ కూడా ఈ వాయిస్ మెసేజ్‌లో చెప్పడంతో ఇప్పుడు ‘మా’ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. విష్ణు, ప్రకాష్‌రాజ్‌ల తర్వాత ‘మా’ అధ్యక్ష పదవికి నేను బరిలోకి దిగుతున్నానని ప్రకటించింది హేమ. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో తనకు 350కి పైగా ఓట్లు వచ్చాయని, వారి మద్దతుతోనే ఈసారి ‘అధ్యక్ష’ పదవి కోసం పోటీ చేస్తున్నానని హేమ  ఇదివరకే చెప్పారు.