MAA Elections: ముగిసిన మా ఎన్నికలు.. ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయంటే?

సినీ ప్రముఖుల మాటల యుద్ధంతో నాలుగు నెలలుగా వార్తల్లో నిలిచిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమరం ముగిసింది.

MAA Elections: ముగిసిన మా ఎన్నికలు.. ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయంటే?

Maa Elections (2)

MAA Elections: సినీ ప్రముఖుల మాటల యుద్ధంతో నాలుగు నెలలుగా వార్తల్లో నిలిచిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమరం ముగిసింది. ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్లో ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగగా.. అరగంట గ్రేస్ పిరియడ్ ఇచ్చారు ఎన్నికల అధికారులు.

మరికాసేపట్లో సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెకింపు ప్రారంభం కానుండగా.. రాత్రి 8గంటల వరకు ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ హోరాహోరీ పోరులో మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లు పోటీ పడ్డాయి. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ సాగుతుండగా.. మొత్తం 626 ఓట్లు పోల్ అయినట్లు చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌తో మొత్తం 665 ఓట్లు నమోదైనట్లు తెలుస్తుంది.

మొత్తం 883 మందికి మా ఎన్నికల్లో ఓటు హక్కు ఉండగా.. రికార్డు స్థాయిలో 72 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది. గతేడాది 474 ఓట్లు పోలవగా.. ఈ ఏడాది రికార్డ్ బ్రేక్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, మంచు లక్ష్మీ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మురళీ మోహన్, హేమ, బెనర్జీ, బండ్ల గణేశ్, జీవితా రాజశేఖర్, అల్లరి నరేష్, సుమన్, పోసాని కృష్ణ మురళి, సాయి కుమార్, వడ్డే నవీన్, శ్రీకాంత్, వీ కే నరేశ్, శివ బాలాజీ, ఉత్తేజ్, జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, నాగార్జున, జయప్రద సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు.