MAA Elections: చిరంజీవి బాటలో ‘మా’ సభ్యులు.. కృష్ణంరాజుకు 113మంది లేఖలు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌(మా)కు వెంటనే ఎన్నికలు జరపాలని, ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుల్లో ఒకరు మెగాస్టార్‌ చిరంజీవి క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజుకు లేఖ రాయడం సినిమా ఇండస్ట్రీలో చర్చకు కారణం అయ్యింది.

MAA Elections: చిరంజీవి బాటలో ‘మా’ సభ్యులు.. కృష్ణంరాజుకు 113మంది లేఖలు

Maa

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌(మా)కు వెంటనే ఎన్నికలు జరపాలని, ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుల్లో ఒకరు మెగాస్టార్‌ చిరంజీవి క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజుకు లేఖ రాయడం సినిమా ఇండస్ట్రీలో చర్చకు కారణం అయ్యింది. ఈ క్రమంలోనే ప్రస్తుత కమిటీ పదవి కాలం ముగిసిందని, దీని వల్ల సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే ఎన్నికలు జరపాలని, చిరంజీవి లేఖ రాసిన 24గంటల్లో.. ఆయన బాటలోనే 113 మంది ‘మా’ సభ్యులు లేఖలు రాశారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కృష్ణంరాజును కోరుతూ లేఖలు రాశారు.

అంతకుముందు తన లేఖలో.. ‘మా’ ఎన్నికలపై ఇప్పటికే సభ్యులు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని, దీని వల్ల సంస్థ ప్రతిష్ఠ మసకబారుతోందని, ఎన్నికలు వెంటనే జరపకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశముందని పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘మా’కు చెడ్డపేరు వస్తుందని, ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కృష్ణంరాజును కోరారు. ‘మీరు పరిశ్రమలో పెద్దవారు. మీకు మొదటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ తెలుసు. సంస్థ ప్రతిష్ఠను మసకబారుస్తున్న వారెవ్వరిని మీరు ఉపేక్షించవద్దు. వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోండి’ అని ఆయన ఆ లేఖలో సూచించినట్లు వర్గాలు వెల్లడించాయి.

ఇక మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణూ పోటీకి దిగుతుండగా.. ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చిన సమయంలో మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ చేశారు. ఇక, పోటీలో మంచు విష్ణు-జీవిత-హేమతో పాటుగా నర్సింహారావు ఉన్నారు. కానీ, ఎన్నికలు ఎప్పుడు జరిగేదీ స్పష్టత మాత్రం ఇవ్వలేదు. పోటీలో ఉన్నవారికి మద్దతిస్తున్న వారు ప్రత్యక్షంగా-పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో పోటీ లేకుండా ఏకగ్రీవంపైనా చర్చ జరిగింది.