గీతాంజలి మరణం – ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : ‘మా’ అధ్య‌క్షుడు వీకే న‌రేష్‌

సీనియర్ నటి గీతాంజలి మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటు అని ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ అన్నారు..

  • Published By: sekhar ,Published On : October 31, 2019 / 05:45 AM IST
గీతాంజలి మరణం – ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం :  ‘మా’ అధ్య‌క్షుడు వీకే న‌రేష్‌

సీనియర్ నటి గీతాంజలి మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటు అని ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ అన్నారు..

అలనాటి సీనియర్ నటి గీతాంజలి మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ (అక్టోబర్ 30,2019) రాత్రి 11.45 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. గీతాంజలి మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటు అని ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ అన్నారు. ‘మా’ అసోసియేషన్ తరపున ఆమె మృతికి సంతాపం తెలుపుతూ లేఖ విడుదల చేశారు..

‘తెలుగు పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది.. మా అమ్మ విజయనిర్మలతోనూ ఆమెకు మంచి అనుబంధం ఉంది.. ‘మా’ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో అందరితోనూ కలివిడిగా ఉండేవారు.. ఆమె దూరమవడం చాలా బాధాకరం’.. అంటూ నరేష్ లేఖలో పేర్కొన్నారు.

Read Also : టాలీవుడ్ లో విషాదం : గుండెపోటుతో సినీ నటి గీతాంజలి కన్నుమూత

తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆమె నటించారు. గీతాంజలి అసలు పేరు మణి. సహనటుడు రామకృష్ణను గీతాంజలి వివాహం చేసుకున్నారు. కాకినాడలో జన్మించిన గీతాంజలి.. 1961లో ఎన్టీఆర్ ‘సీతారాముల కల్యాణం’తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో సీత పాత్రలో నటించారు.