Macherla Niyojakavargam: సెన్సార్ పూర్తి చేసుకున్న మాచర్ల నియోజకవర్గం

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. మాచర్ల నియోయజకవర్గం సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

Macherla Niyojakavargam: సెన్సార్ పూర్తి చేసుకున్న మాచర్ల నియోజకవర్గం

Macherla Niyaojakavargam: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో నితిన్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్లు, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం వారికే ఎక్కువగా నచ్చుతుంది – కృతి శెట్టి

మాచర్ల నియోయజకవర్గం సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ‘మాచర్ల నియోజకవర్గం’ టీమ్‌ను అభినందించారట. పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని.. నితిన్‌తో పాటు ఇతర నటీనటులు ఈ సినిమాలో బాగా నటించారని అభినందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మహతి స్వర సాగర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరో మేజర్ అసెట్‌గా నిలవనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం అమెరికా టార్గెట్ ఎంతంటే..?

ఇక ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాలో నితిన్ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.