సూపర్ స్టార్ సినిమాలో మ్యాచోస్టార్..

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో మ్యాచో స్టార్ గోపిచంద్..

10TV Telugu News

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో మ్యాచో స్టార్ గోపిచంద్..

మ్యాచో స్టార్ గోపిచంద్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో విలన్‌గా నటించనున్నాడనే వార్త వైరల్ అవుతోంది. రజనీకాంత్ ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రజనీ నటిస్తున్న 168వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి కీలక పాత్ర ధారులు. లేడి సూపర్ స్టార్ నయనతార ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

‘అన్నాతే’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దర్శకుడు శివ గోపిని సంప్రదించగా ఓకే చెప్పినట్టు సమాచారం. గోపిచంద్ హీరోగా నటించిన ‘శౌర్యం’ సినిమాతోనే శివ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత వీళ్ల కలయికలో ‘శంఖం’ చిత్రం వచ్చింది. శివ ప్రస్తుతం తమిళనాట స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

తల అజిత్‌తో ఏకంగా నాలుగు సినిమాలు చేసి తమిళ తంబీలను ఆకట్టుకున్నాడు. ఈ పరిచయం కారణంగా గోపి, శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ‘జయం’, ‘వర్షం’, ‘నిజం’ సినిమాల్లో గోపిచంద్ విలన్ పాత్రల్లో మెప్పించన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు.

See Also | అహం బ్రహ్మాస్మి’.. సీతా రామరాజు క్లాప్..