Madhubala : పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిని.. కానీ నాగచైతన్య అంటే ఇష్టం.. మధుబాల!

మణిరత్నం తెరకెక్కించిన లవ్ అండ్ రొమాంటివ్ థ్రిల్లర్ మూవీ 'రోజా'. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించి అప్పటి కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టిన హీరోయిన్ 'మధుబాల'. తాజాగా ఆమె ప్రేమదేశం సినిమాలో నటించింది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే...

Madhubala : పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిని.. కానీ నాగచైతన్య అంటే ఇష్టం.. మధుబాల!

Madhubala : మణిరత్నం తెరకెక్కించిన లవ్ అండ్ రొమాంటివ్ థ్రిల్లర్ మూవీ ‘రోజా’. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించి అప్పటి కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టిన హీరోయిన్ ‘మధుబాల’. సినిమా వచ్చి 30 ఏళ్ళ అవుతున్న ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదే అందంతో ఇప్పటి కుర్రకారు క్రష్ లిస్ట్ లో కూడా స్థానం సంపాదించుకుంటుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అందాల భామ వరుస సినిమాలు చేస్తుంది.

Pawan Kalyan: హరీష్ శంకర్ అనౌన్స్‌మెంట్.. వద్దు బాబోయ్ అంటోన్న పవన్ ఫ్యాన్స్!

తెలుగులో ‘నిఖిల్ – సూర్య వర్సెస్ సూర్య’, ‘ఎన్టీఆర్ – నాన్నకు ప్రేమతో’ సినిమాలో నటించగా, తాజాగా ఆమె ప్రేమదేశం సినిమాలో నటించింది. మేఘ ఆకాష్, అరుణ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి మధుబాల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిని కానీ ఐ లవ్ నాగచైతన్య అంటూ వ్యాఖ్యలు చేయిస్తుంది.

“ఒకప్పుడు నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని, కానీ ఇప్పుడు నాగచైతన్య అంటే ఇష్టం” అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియోని చైతన్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్ సాయిపల్లవి అంటే చాలా ఇష్టమని, ఆమె చాలా బాగా డాన్స్ వేస్తుంది అంటూ ప్రశంసించింది మధుబాల.