Madras HC : సూర్యకు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు..

ఆదాయపు పన్ను అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహా కోరుతూ సూర్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు..

Madras HC : సూర్యకు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు..

Suriya

Madras HC: వెర్సటైల్ యాక్టర్, తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాదాపు రూ.3కోట్లు వరకు ట్యాక్స్ చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. దీంతో సూర్య వారి ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్ట్ తోసిపుచ్చింది. అసలేం జరిగిందంటే.. నటుడు సూర్య తన ఆదయానికి తగ్గట్లు పన్ను చెల్లింపులు జరపడం లేదంటూ 2010లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసులో ఒకేసారి సోదాలు చేశారు.

Suresh Raina Biopic : నా బయోపిక్.. సూర్య చేస్తే బాగుంటుందన్న స్టార్ క్రికెటర్

సోదాల్లో లెక్కల్లో లేని పలు ఆదాయాలకు సంబంధించి మొత్తం రూ.3.11 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహా కోరుతూ సూర్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సెలబ్రిటీ స్థాయిలో ఉన్న మీలాంటి వారు మిగతా వారికి ఆదర్శంగా నిలబడాలని చెబుతూ.. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది మద్రాస్ హైకోర్టు.

Suriya 39 : సూర్య ‘జై భీమ్’..

ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’ తో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్య.. కంటెంట్ ఓరియంటెడ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ తన స్టైల్లో దూసుకెళ్తున్నారు. జ్ఞానవేల్ డైరెక్షన్లో 39వ సినిమా ‘జై భీమ్’ చేస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో ‘ఎదర్కుం తునిందవన్’ మూవీస్ చేస్తున్నారు. ఇది సూర్య నటిస్తున్న 40వ సినిమా.

Etharkkum Thunindhavan : సూర్య 40.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్..