Madras High Court : శంకర్ సినిమాలకు లైన్ క్లియర్.. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..

చరణ్ సినిమా, ‘అపరిచితుడు’ రీమేక్ పనులు చేసుకోవచ్చంటూ దర్శకుడు శంకర్‌కు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది..

Madras High Court : శంకర్ సినిమాలకు లైన్ క్లియర్.. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..

Shankar

Madras High Court: సిల్వర్ స్క్రీన్ సెల్యూలాయిడ్ శంకర్‌, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబోలో.. దిల్ రాజు ప్రొడక్షన్‌లో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో సినిమా తెరకెక్కుతుంది అని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. చరణ్ ఆగస్ట్ తర్వాత ‘ఆచార్య’, ‘ట్రిపుల్ ఆర్’ కంప్లీట్ చేసుకుని ఫ్రీ అయిపోతే.. శంకర్ సినిమా స్టార్ట్ చేసి నెక్ట్స్ సమ్మర్‌కి రిలీజ్ అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడప్పుడే సినిమా మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదంటూ వార్తలు వచ్చాయి.

RC 15 : రామ్ చరణ్ – శంకర్ సినిమాకు బ్రేక్..!

అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత లైకా ప్రొడక్షన్స్ సంస్థకి, దర్శకుడు శంకర్‌కి మధ్య విభేదాలొచ్చాయి. తెలుగులో చరణ్‌తో సినిమా, హిందీలో ‘అపరిచితుడు’ రీమేక్ చేయనున్నట్లు శంకర్ ప్రకటించడంతో.. శంకర్‌కి 36 కోట్ల పారితోషికం, అడ్వాన్స్‌గా 14 కోట్లు ఇచ్చాం, బడ్జెట్ పెరిగిపోయిందటూ.. శంకర్ ‘ఇండియన్ 2’ కంప్లీట్ చెయ్యకుండా మరో సినిమాకి ఎలా షిఫ్ట్ అవుతారంటూ నిర్మాత హైకోర్టుని ఆశ్రయించారు.

ఎట్టకేలకు హైకోర్టు శంకర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చరణ్ సినిమా, ‘అపరిచితుడు’ రీమేక్ పనులు చేసుకోవచ్చంటూ దర్శకుడు శంకర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. లైకా వారి వాదన, శంకర్ వెర్షన్ పరిశీలించిన తర్వాత.. ‘ఇండియన్ 2’ పూర్తి కాకుండా శంకర్ తర్వాతి ప్రాజెక్టులకు పని చేయకూడదు అంటూ లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌ను సమర్థించలేమని.. శంకర్ తదుపరి సినిమాలు చేసుకోవచ్చని మద్రాసు హైకోర్ట్ తీర్పునిచ్చింది. ముందుగా రామ్ చరణ్ – దిల్ రాజు సినిమా కంప్లీట్ చేసి, తర్వాత ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌కి శంకర్ బాలీవుడ్ వెళ్లనున్నారని తెలుస్తోంది.

Kiara Advani : కియారా కమిట్‌మెంట్.. శంకర్‌తో ఎన్ని సినిమాలంటే..