నువ్వు సింగం అయితే నేను హైనా : మాఫియా చాప్టర్ -1 టీజర్

అరుణ్ విజయ్, ప్రసన్న, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ 'మాఫియా చాప్టర్ - 1' టీజర్ విడుదల..

  • Edited By: sekhar , September 17, 2019 / 11:32 AM IST
నువ్వు సింగం అయితే నేను హైనా : మాఫియా చాప్టర్ -1 టీజర్

అరుణ్ విజయ్, ప్రసన్న, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘మాఫియా చాప్టర్ – 1’ టీజర్ విడుదల..

కోలీవుడ్‌లో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ‘మాఫియా చాప్టర్ – 1’ అనే మూవీ తెరకెక్కుతోంది. అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తుండగా, ప్రసన్న విలన్‌గా కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తుండగా, ‘ధురువంగల్ పతినారు’ (తెలుగులో 16) ఫేమ్, కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. అరుణ్ విజయ్ అడవికి రాజు సింగంతో పోలుస్తూ తన క్యారెక్టర్‌ గురించి చెప్తుండగా, ప్రసన్న తన క్యారెక్టర్‌ను హైనాతో కంపేర్ చేస్తూ చెప్పడం టీజర్‌లో హైలెట్ అయ్యింది. త్వరలో మాఫియా చాప్టర్ – 1 విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

మ్యూజిక్ : జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ : గోకుల్ బినోయ్, ఎడిటింగ్ & డిఐ : శ్రీజిత్ సారంగ్, ఆర్ట్ : శివ శంకర్, స్టంట్స్ : డాన్ అశోక్.