మల్టీస్టారర్ ‘మహా సముద్రం’ థీమ్ పోస్టర్

  • Edited By: sekhar , November 14, 2020 / 12:02 PM IST
మల్టీస్టారర్ ‘మహా సముద్రం’ థీమ్ పోస్టర్

Maha Samudram: సిద్ధార్థ్‌, శర్వానంద్‌ హీరోలుగా ‘ఆర్.ఎక్స్‌ 100’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన్ దర్శకుడు అజయ్‌ భూపతి రూపొందిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ రావు హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.


దీపావళి సందర్భంగా చిత్రయూనిట్ థీమ్ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ థీమ్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.


‘నేను తరంగాల కంటే మొండిగా ఉన్నాను.. సముద్రాల కంటే లోతుగా ఉన్నాను’.. అంటూ శర్వా తన ట్వీట్లో పేర్కొన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.