Maharashtra : థియేటర్స్ ఎందుకు తెరవడం లేదు..’మహా’ సర్కార్ పై కంగనా ఫైర్

సినిమా థియేటర్ల తెరిచే విషయంలో ఎవరూ నోరు మెదపడం లేదని, విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాల నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నటి కంగనా తెలిపారు.

Maharashtra : థియేటర్స్ ఎందుకు తెరవడం లేదు..’మహా’ సర్కార్ పై కంగనా ఫైర్

Kangana

Kangana Ranaut : సినిమా రంగంలో ఉన్న వాళ్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒకరు. ఏ విషయాన్ని అయినా..కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు. ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు యదావిధిగా సాగుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో…దాదాపు అన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయని, కానీ..మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం…థియేటర్స్ తెరిచేందుకు అనుమతినివ్వడం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. తనకు ఈ విషయంలో బాధగా ఉందన్నారు.

Read More : Katrina Kaif Fit Body : కత్రినా వర్కవుట్స్…వీడియో వైరల్

సినిమా థియేటర్ల తెరిచే విషయంలో ఎవరూ నోరు మెదపడం లేదని, విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాల నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. థియేటర్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఒకవిధంగా…వాటిన పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోందంటూ మండిపడ్డారామె. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంత కుమార్ కి ప్రత్యేక మెసేజ్ పంపారని ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా పంచుకున్నారు కంగనా. ఏం మర్యాద, ఏం వ్యక్తిత్వం ప్రముఖ నాయకులు, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం గ్రేటెస్ట్ శ్రీ శాంత కుమార్ అందమైన లెటర్ పంపించారు. నా పనికి పంపిన ప్రశంసలకు కళ్లు చెమర్చాయి’ అంటూ కంగనా పిక్చర్ ను కూడా షేర్ చేశారు. కంగనా రనౌత్ విషయానికి వస్తే..ఈమె దివంగత ముఖ్యమంత్రి జయలలిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.

Read More : Ganesh Idol is Immersed : గణేషుడ్నే ఎందుకు నిమజ్జనం చేస్తారు ?

ఇటీవలే…సుశాంత్ సింగ్ మృతి కేసుపై మాట్లాడారు. మూవీ మాఫియా కంటే..ముంబాయి పోలీసులంటేనే..తనకు ఎక్కువగా భయం ఉందన్నారు. ముంబాయి పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే) అనిపిస్తోదంటూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ మాఫియాతో ఉద్దవ్ థాకరేకు సంబంధాలున్నాయని, పాలిహిల్ కార్యాలయం భవనంలోని అక్రమ కట్టడాలను బీఎంసీ కూల్చివేసిన అనంతరం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.