Maha Samudram : ఓటిటిలో ‘మహా సముద్రం’

 'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా

Maha Samudram : ఓటిటిలో ‘మహా సముద్రం’

Maha Samudram

Maha Samudram :  ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించారు. ఇద్దరు యువ హీరోలు కలిసి మల్టి స్టారర్ గా రావడం, సిద్దార్థ్ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం, ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ సెకండ్ మూవీ కావడం.. ఇవన్నీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ముందే వచ్చిన టీజర్స్, ట్రైలర్స్ కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.

Hero : రిపబ్లిక్ డేకి మహేష్ ఫ్యామిలీ నుంచి ‘హీరో’

ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

Shannu – Deppthi : బిగ్ బాస్ లో సన్నీ- షణ్ను గొడవ… సన్నీని ఏకిపారేసిన షణ్ను గర్ల్ ఫ్రెండ్

‘మహా సముద్రం’ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. థియేట్రికల్ లాస్ ని ఇక్కడ కవర్ చేశారని కూడా సమాచారం. నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో ‘మహా సముద్రం’ సినిమా ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.