Major : సినిమా టికెట్ కోసం క్యూలో మహేష్ బాబు, అడివి శేష్..

మహేశ్‌బాబు సినిమా టికెట్‌ కోసం క్యూలో నిలబడటమేంటని అనుకుంటున్నారా?. ఇటీవల సినిమా ప్రమోషన్స్ కోసం సినిమా హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియా...............

Major :  సినిమా టికెట్ కోసం క్యూలో మహేష్ బాబు, అడివి శేష్..

Mahesh Babu  : మహేశ్‌బాబు సినిమా టికెట్‌ కోసం క్యూలో నిలబడటమేంటని అనుకుంటున్నారా?. ఇటీవల సినిమా ప్రమోషన్స్ కోసం సినిమా హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియా బాట పట్టడం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉండి, యాక్టీవ్ గా ఉన్నవారితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియా వ్యక్తుల్లో నిహారిక NM ఒకరు. గత కొన్ని రోజులుగా ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండటంతో స్టార్ హీరోలు సైతం ఈమెతో కలిసి తన అకౌంట్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

అడివి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మేజర్. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు.

తాజాగా మేజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ నిహారిక తో అడివిశేష్, మహేష్ కలిసి ఓ వీడియో చేశారు. ఈ వీడియోలో భాగంగా నిహారిక సినిమా టికెట్‌ కోసం లైన్‌లో నిలబడగా ఆమె ముందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. మధ్యలో అడివి శేష్‌ రావడంతో లైన్ లో అలా మధ్యలో వచ్చేస్తారేంటి అని నిహారిక అడివిశేష్ తో గొడవ పడుతుంటే మహేష్ బాబు వచ్చి లైన్ మధ్యలో నిల్చుంటాడు. మహేశ్‌బాబుని చూడగానే నిహారిక సర్‌ప్రైజ్‌ అవుతుంది. మా స్నేహితులను కూడా పిలవొచ్చా అని మహేశ్‌ అడగ్గానే ఓకే అంటుంది. దాంతో లైన్‌ పెరుగుతుంది. నిహారిక మహేష్ ని ఫోన్‌ నంబరు అడిగేలోపు మహేశ్‌ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అడివి శేష్ నా నుంబర్ ఇవ్వనా అంటే నీది ఎందుకు అంటూ ఫన్నీగా ఈ వీడియో ముగుస్తుంది.

Cannes 2022 : ముగిసిన కాన్స్ ఫిలిం ఫెస్టివల్.. భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు..

మహేష్ బాబు తను నిర్మించిన సినిమా కోసం హీరో అడివి శేష్ తో కలిసి డిజిటల్ క్రియేటర్ నిహారికతో ఇలా సరదాగా ప్రమోషన్ చేశారు. ఇందుకోసం మహేష్ సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డట్టు యాక్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. గతంలో కూడా నిహారిక సర్కారు వారి పాట, KGF లాంటి మరెన్నో సినిమాలని కూడా ఇలా ప్రమోట్ చేసింది. దీంతో స్టార్ హీరోలు సైతం ఈమెతో ప్రమోషన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు.