Mahesh – Dulquer : సానియా మీర్జా ఫేర్‌వెల్‌లో సందడి చేసిన మహేష్, దుల్కర్..
టెన్నిస్ ప్లేయర్ గా దేశంలో ఎంతో పేరుని సంపాదించుకున్న క్రీడాకారిణి సానియా మీర్జా.. ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సానియా తన సొంతగడ్డ హైదరాబాద్ లో ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబందించిన ప్రముఖులు హాజరయ్యారు.

mahesh babu and Dulquer salmaan are attending sania mirza farewell party
Mahesh – Dulquer : టెన్నిస్ ప్లేయర్ గా దేశంలో ఎంతో పేరుని సంపాదించుకున్న క్రీడాకారిణి సానియా మీర్జా.. టెన్నిస్ ఆటకే కాకుండా ఉమెన్ స్పోర్ట్స్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది. రెండు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో విజయాలు, మెడల్స్ అందుకోవడమే కాకుండా దేశం తరుపునుంచి.. అర్జున అవార్డు, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకుంది. ఇక ఇటీవల సానియా అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సానియా తన సొంతగడ్డ హైదరాబాద్ లో ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించింది.
NTR30 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఈరోజు NTR30 అప్డేట్ రాబోతుంది..
ఈ పార్టీకి సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబందించిన ప్రముఖులు హాజరయ్యారు. నిన్న (మార్చి 5) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ వీక్షించడానికి కేటిఆర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ తో పాటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా హాజరయ్యాడు. ఇక సాయంత్రం జరిగిన ఫేర్‌వెల్ పార్టీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా, ఎ ఆర్ రెహమాన్ హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో సానియాతో దిగిన ఫోటోను మహేష్ బాబు షేర్ చేస్తూ.. ‘ఇన్నాళ్ల నీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే ఈ ఈవెంట్ లో రెహమాన్ తో దిగిన ఫోటోను కూడా షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కాగా రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ పార్టీకి రాలేకపోవడంతో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సారీ చెబుతూ పోస్ట్ పెట్టింది. ఇక ఈ ఫేర్‌వెల్‌లో.. ప్లేయర్ గా తన ప్రయాణం ముగియడంతో సానియా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది.
ఇన్నాళ్లు ప్లేయర్ గా సేవలు అందించిన సానియా.. ఇప్పటినుంచి భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తాను అంటూ తెలియజేసింది. అలాగే బాలీవుడ్ నుంచి కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయని, ఆసక్తి లేకపోవడంతో ఆ ఆఫర్లకు నో చెప్పినట్లు కూడా చెప్పుకొచ్చింది.