Mahesh Babu : ఫ్యామిలీలతో కలిసి ఫారెన్ టూర్స్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేష్, చరణ్

  ఏమాత్రం షూటింగ్ గ్యాప్ దొరికినా విదేశాల్లో విహరిస్తుంటారు మన స్టార్ హీరోలు. అందులో మహేష్ ముందు వరసలో ఉంటారు. గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో వాలిపోతారు. ఇక ఇటీవల చరణ్ కూడా

Mahesh Babu : ఫ్యామిలీలతో కలిసి ఫారెన్ టూర్స్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేష్, చరణ్

Mahesh Babu

Ram Charan :  ఏమాత్రం షూటింగ్ గ్యాప్ దొరికినా విదేశాల్లో విహరిస్తుంటారు మన స్టార్ హీరోలు. అందులో మహేష్ ముందు వరసలో ఉంటారు. గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో వాలిపోతారు. ఇక ఇటీవల చరణ్ కూడా ఖాళీ దొరికితే ఉపాసనతో కలిసి విదేశాలకి చెక్కేస్తున్నారు. లేటెస్ట్ గా ఇటలీలో రామ్ చరణ్ సందడి చేస్తుంటే, ఆల్రెడీ యూరప్ లో ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్ బాబు.

భారీ కమర్షియల్ మూవీస్ డైరెక్టర్ శంకర్ కాంబినేష్ లో రామ్ చరణ్ 15వ సినిమా ఆల్మోస్ట్ 40 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. రాజమండ్రి, పూణే, పంజాబ్, వైజాగ్ షూటింగ్ షెడ్యూల్స్ ఫినిష్ చేసుకున్న రామ్ చరణ్ తేజ్ షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ రావడంతో. తన లైఫ్ పాట్నర్ ఉపాసనతో కలసి ఇటలీ వెకేషన్ కెళ్లారు. తన 10వ వెడ్డింగ్ యానివర్శరీ సెల్రబేషన్ కూడా ఇటలీలోని ఫ్లోరెన్స్ లో సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు. ప్రస్తుతం అక్కడ వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు మెగా పవర్ స్టార్. ఇటీవలే ఉపాసనతో కలిసి ఇటలీలో దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు చరణ్. ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Akshay Kumar : పరాజయంలో డబల్ హ్యాట్రిక్.. అక్షయ్‌కి ఏమైంది??

 

త్రివిక్రమ్ కాంబినేషన్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు 28వ సినిమా జులై నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. తమ పిల్లల స్కూల్స్ కూడా హాలీడేస్ రావడంతో ఈ ఫ్రీ టైమ్ ను ఫ్యామిలీ మెంబర్స్ తో యూరప్ లాంగ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్ బాబు. జర్మనీ వెకేషన్ లో ఉండగానే త్రివిక్రమ్ టీమ్ మహేశ్ బాబు సినిమా ఫైనల్ వెర్షన్ వినిపించి, స్క్రిప్ట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా జర్మనీలో ఉన్నట్టు మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఓ సెల్ఫీ పోస్ట్ చేశారు. ఎప్పుడూ షూటింగ్ లతో బిజి షెడ్యూల్స్ గడిపే స్టార్ హీరోలు ఏమాత్రం టైమ్ దొరికినా విదేశాల్లో విహార యాత్రలతో ఇలా రిలాక్స్ అవుతున్నారు.