Thaman : థమన్ పై మహేష్, రవితేజ ఫ్యాన్స్ ఫైర్..

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యారు. ఒకవైపు సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్, మరో వైపు మాస్ మహారాజు రవితేజ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో థమన్ ను....................

Thaman : థమన్ పై మహేష్, రవితేజ ఫ్యాన్స్ ఫైర్..
ad

Thaman :  యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యారు. ఒకవైపు సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్, మరో వైపు మాస్ మహారాజు రవితేజ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో థమన్ ను ఆడుకుంటున్నారు. ఇంతకీ థమన్ చేసిన తప్పేంటి? ఇటివలే మహేష్ తో సర్కార్ వారి పాట సినిమా కూడా చేశాడు. మరి ఎందుకు మహేశ్ ఫ్యాన్స్ థమన్ పై ఫైర్ అవుతున్నారు?

రీసెంట్ గా థమన్, సర్కార్ వారి పాటతో మహేశ్ బాబుకి ఆల్ టైమ్ హిట్ ఆల్భమ్ ఇచ్చాడు. అందులో కళావతి సాంగ్ మిలియన్ల కొద్ది వ్యూస్ తో రికార్డులు బద్ధలుకొట్టింది. అయితే తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ కు సంబంధించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న థమన్ తన కెరీర్ లోనే మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు సరైనోడు, రేసుగుర్రం, అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ తో ఉన్నాయని చెప్పారు. దాంతో ఇటు మహేశ్, అటు మాస్ రాజ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు.

Balakrishna : భయం మా బయోడేటాలోనే లేదు.. NBK 107 టీజర్ రిలీజ్..

ఒకవైపు మహేశ్ ఫ్యాన్స్ కు మరోవైపు రవితేజ ఫ్యాన్స్ కు ఎక్కడో కాలింది. దూకుడు, బిజినెస్ మేన్ సర్కారువారి పాట లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ గుర్తుకు రాలేదా అంటు మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటే, కిక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా గుర్తుకు రాలేదా అంటు ఫైర్ అవుతున్నారు రవితేజ ఫ్యాన్స్. తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జీలలో థమన్ ఒకరు. ఆహా ప్లాట్ ఫామ్ కూడా అల్లు వారిదే కావడంతో అల్లు అర్జున్ తో తనకు మూడు హిట్స్ ఉన్నాయన్నారు కాని, తన కెరీర్ లోనే మూడు బ్లాక్ బస్టర్సే ఉన్నాయని అని చెప్పలేదు కదా అని థమన్ ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు. అయినా ఆ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కోపాన్ని చల్లార్చడానికి వివరణ ఇవ్వక తప్పేలా లేదు థమన్ కు. మరి దీనిపై థమన్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.