Mahesh Babu : శ్రీరామనవమికి SSMB 28 ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్సమెంట్? ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసిన చిత్రయూనిట్..
మహేష్ బాబు(Mahesh Babu) - త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్రయూనిట్ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఇస్తూ ట్వీట్ చేసింది.

Mahesh Babu and Trivikram combo movie SSMB 28 first look and title revealed on Sriramanavami
Mahesh Babu : మహేష్ బాబు(Mahesh Babu) – త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీల(Sreeleela) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే సీనియర్ నటుడు జయరాం(Jayaram) సెట్ నుంచి మహేష్ బాబుతో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా(Khaleja) సినిమాల తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా చిత్రయూనిట్ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఇస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో.. హే సూపర్ ఫ్యాన్స్, మేము కూడా #SSMB28 కోసం మీ నిరీక్షణ & ఉత్సాహాన్ని పంచుకుంటాము. సూపర్‌స్టార్ మాస్ విందు కోసం మీరు ఎదురుచూస్తున్నారు, అది చాలా విలువైనది, మేము హామీ ఇస్తున్నాము. సరైన సమయంలో ప్రకటిస్తాము. చూస్తూ ఉండండి అని పోస్ట్ చేశారు. చివర్లో ఎక్కుపెట్టిన విల్లు, ఫైర్ సింబల్ పోస్ట్ చేశారు. దీంతో శ్రీరామనవమికి అంటే మార్చ్ 29న సినిమా నుంచి అప్డేట్ ఇస్తారని, సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేస్తారని సమాచారం. ఈ ట్వీట్ చుసిన తర్వాత మహేష్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Anurag Thakur : ఓటీటీల్లో అశ్లీలతపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. యాక్షన్ తీసుకుంటాం..
ప్రస్తుతం SSMB 28 వర్కింగ్ టైటిల్ తో నడుస్తున్న ఈ సినిమాకి పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నా చిత్రయూనిట్ వాటికి స్పందించలేదు. మరి త్రివిక్రమ్ తన మార్క్ తో ఎలాంటి టైటిల్ పెడతాడో అని ఎదురుచూస్తున్నారు.
Hey Superfans, we share your anticipation & excitement for #SSMB28! The wait for the Superstar's Mass feast will be well worth it, we promise🤩
Keep an eye out for the announcement at the perfect time🏹🔥 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @NavinNooli @vamsi84
— Haarika & Hassine Creations (@haarikahassine) March 20, 2023