Mahesh Babu: నేను సందడి చేయడానికి రావడం లేదు.. థియేటర్లను ఊ.. సూర్య భాయ్ కమింగ్
ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. సందర్భాన్ని బట్టి స్టార్ హీరోల పాత చిత్రాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఇలా విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి.

Business Man Movie Re Release
Mahesh Babu-Businessman: ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. సందర్భాన్ని బట్టి స్టార్ హీరోల పాత చిత్రాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఇలా విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టిన మహేశ్ బాబు(Mahesh Babu) ఇప్పుడు మరోసారి రీరిలీజ్‌కు సిద్దం అవుతున్నారు. ఈ విషయం తెలిసిన సూపర్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్(Puri Jagannadh,) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బిజినెస్‌మేన్'(Business Man). ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించింది. ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆర్ఆర్ వెంకట్ నిర్మించారు. 2012 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. నెగిటివ్ రోల్ లాంటి డిఫరెంట్ పాత్రలో మహేశ్ నటన అదుర్స్ అనిపించేలా ఉండడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
Mahesh Babu : మహేష్ ‘గుంటూరు కారం’ నుంచి అప్పటిదాకా ఇంకే అప్డేట్ ఉండదట.. నిరాశలో ఫ్యాన్స్..
ఈ చిత్రం వచ్చి పదేళ్లు దాటినా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమాలోని డైలాగ్‌లు మీమ్స్ రూపంలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9న సందర్భంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. దీంతో అభిమానులు సూర్య భాయ్ మళ్లీ వస్తున్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మహేష్ కి జోడిగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mahesh Babu : నా హీరోల్లో మహేష్ బాబు బెస్ట్.. నేను అనుకున్న రియాక్షన్ కరెక్ట్‌గా ఇచ్చేవాడు.. తేజ!