Mahesh Babu: బాలీవుడ్‌పై మహేష్ కామెంట్స్.. క్లారిటీ వచ్చిందిగా!

మహేష్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఈ పేరుతో ఊగిపోతుంది. మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రిలీజ్‌కు రెడీ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి....

Mahesh Babu: బాలీవుడ్‌పై మహేష్ కామెంట్స్.. క్లారిటీ వచ్చిందిగా!

Mahesh Babu Clarifies About Comments Made On Bollywood

Mahesh Babu: మహేష్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఈ పేరుతో ఊగిపోతుంది. మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రిలీజ్‌కు రెడీ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌తో మహేష్ అండ్ టీమ్ దుమ్ములేపుతున్నారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ మహేష్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్‌ను రెట్టింపు చేస్తున్నాడు. అంతేగాక మహేష్ నిర్మాతగా చేస్తున్న మేజర్ సినిమా ప్రమోషన్స్‌లోనూ బిజీగా మారాడు.

Mahesh Babu: పీకాక్‌ మేగజీన్‌ కవర్‌ పేజీపై స్టయిలిష్ మహేశ్..!

ఇటీవల మేజర్ చిత్ర ట్రైలర్‌ను అధికారికంగా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ నటిస్తుండగా, ఈ చిత్రాన్ని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ క్రమంలోనే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమా ఖ్యాతి నలుమూలలా వ్యాప్తి చెందుతున్న క్రమంలో, తాను కేవలం తెలుగు సినిమాలే చేస్తానని.. బాలీవుడ్‌లో సినిమాను చేయాల్సిన అవసరం తనకు లేదని మహేష్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ కామెంట్స్ సరికొత్త వివాదానికి తెరలేపడంతో, మహేష్ చేసిన కామెంట్స్ దుమారం రేపబోతున్నట్లు కనిపించాయి.

Mahesh Babu : హిందీలో కూడా రిలీజ్ చేయాల్సింది.. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ అంటున్న సెన్సార్ బోర్డు మెంబర్..

అయితే తాజాగా సర్కారు వారి పాట చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మహేష్, బాలీవుడ్‌పై తాను చేసిన కామెంట్స్‌కు సంబంధించి వివరణ ఇచ్చాడు. తాను అన్ని భాషల సినిమాలను గౌరవిస్తానని.. హిందీ భాష అంటే తనకు కూడా ఇష్టమని.. అయితే ప్రస్తుతం తాను పనిచేస్తున్న భాషలోనే తనకు సౌకర్యంగా ఉందని మహేష్ కామెంట్ చేశాడు. తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాలనే తన కల నెరవేరుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూ మహేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇక త్వరలో రాజమౌళి డైరెక్షన్‌లో తాను చేయబోయే సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రాబోతుందని మహేష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఏదేమైనా మహేష్ చేసిన కామెంట్స్ దుమారం రేపకముందే, వాటిపై క్లారిటీ ఇవ్వడంతో మహేష్ ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టినట్లయ్యింది.